Mega Heroes: సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి చాలా గొప్ప గుర్తింపైతే ఉంది. ఆ ఫ్యామిలీ నుంచి ఏ ఒక్క హీరో సినిమా వచ్చినా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా రికార్డులు బ్రేక్ అవుతూ ఉంటాయి. తమ అభిమాన హీరోల సినిమాలు ఎప్పుడు వస్తాయి అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025 వ సంవత్సరంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజీ అనే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. అందులో ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలువగా హరిహర వీరమల్లు డిజాస్టర్ అయింది… మొత్తానికైతే ఈ సినిమాలతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడు.
ఇక మరోసారి 2026 వ సంవత్సరంలో దండయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు. సంక్రాంతి కానుకగా చిరంజీవి హీరోగా వస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తుందని చిరంజీవి నమ్ముతున్నాడు…
ఇక మార్చి 26వ తేదీన ‘పెద్ది’ సినిమాతో రామ్ చరణ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ లో పవన్ కళ్యాణ్ చేసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర సినిమాని సైతం ఈ నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలా 2026 వ సంవత్సరం మొత్తం మెగా ఫ్యామిలీ సినిమాలు భారీ రేంజ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్నాయి.
అందులో ఏ సినిమా ఇలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ఇక సాయిధరమ్ తేజ్ చేస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ వరుణ్ తేజ్ చేస్తున్న కొత్త సినిమా సైతం 2026 లోనే రిలీజ్ కి ముస్తాబవుతుండడం విశేషం… 2026 వ సంవత్సరం మెగా హీరోలకు కలిసొస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…