Jathi Ratnalu Director Anudeep: జాతిరత్నాలు మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు కేవీ అనుదీప్. రెండో మూవీగా కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ చేశాడు. ప్రిన్స్ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. సెటైరికల్, సర్కాస్టిక్ కామెడీకి అనుదీప్ పెట్టింది పేరు. ఆయన హాస్యం భిన్నమైన శైలి కలిగి ఉంటుంది. సిల్వర్ స్క్రీన్ పై నాన్ స్టాప్ కామెడీ పంచే అనుదీప్ ఆఫ్ స్క్రీన్లో కూడా పిచ్చ ఎంటర్టైన్ చేస్తాడు. ఇంటర్వ్యూలు, ప్రమోషనల్ ఈవెంట్స్, టెలివిజన్ షోస్ లో అనుదీప్ టైమింగ్ కామెడీ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎటువైపు నుండి సెటైర్ వదులుతాడో కనిపెట్టడం కష్టం.

సందర్బోచితంగా అప్పటికప్పుడు కామెడీ చేయడం కొంత మందికి మాత్రమే ఉండే క్వాలిటీ. అది అనుదీప్ లో పుష్కలంగా ఉంది. అయితే పైకి చాలా సరదాగా కనిపించే అనుదీప్ ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నాడట. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన హెల్త్ కండిషన్ గురించి అనుదీప్ బయటపెట్టారు. అనుదీప్ మాటలు విన్నాక అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
అనుదీప్ మాట్లాడుతూ.. నేను అత్యంత సెన్సిటివ్ డిసీజ్ తో బాధపడుతున్నాను. శరీరంలో సంభవించిన కొన్ని మార్పులు అనారోగ్యానికి దారితీశాయి. నాకు గ్లూటెన్ సహించదు. అది నేను తినకూడదు. కాఫీ తాగ కూడదు. పొరపాటున తాగితే రెండు రోజులు నిద్ర పట్టదు. చివరకు పండ్ల రసాలు కూడా ముట్టుకోకూడదు. పళ్ళ రసం నా మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. మెదడు చురుకుగా పని చేయదు. కాంతివంతమైన లైట్స్ శరీరానికి పడవు. చివరకు ఘాటైన వాసనలు కూడా ఇబ్బంది పెడతాయి. ఇలాంటి అరుదైన సమస్యతో నేను బాధపడుతున్నానని అనుదీప్ చెప్పుకొచ్చాడు.

అనుదీప్ ఆరోగ్య పరిస్థితి తెలిసి ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఈ రుగ్మత నుండి కోలుకోవాలని కోరుకుంటున్నారు. జాతిరత్నాలు మూవీతో అనుదీప్ డైరెక్టర్ గా మారారు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన జాతిరత్నాలు సంచలన విజయం సాధించింది. 2021లో భారీ ప్రాఫిట్స్ పంచిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. దీంతో కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ అనుదీప్ కి అవకాశం ఇచ్చాడు. వీరి కాంబినేషన్ లో ఇటీవల విడుదలైన ప్రిన్స్ అనుకున్న స్థాయిలో ఆడలేదు.