Photo Story: సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేవారు ఎవరైనా స్టార్ కావాలని అనుకుంటారు. కానీ అందరి జీవితం ఒకలా ఉండదు. కొందరికి వివిధ కారణాల వల్ల పరిశ్రమలో కొనసాగే అవకాశం ఉండదు. చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఓ హీరోయిన్ ఒంపు, సొంపులతో ఆకట్టుకుంది. అందంతో కుర్రకారును పిచ్చోళ్లను చేసింది. కానీ ఆ తరువాత తన ఫిజిక్ లో వచ్చిన మార్పుల కారణంగా సినిమాలకు దూరమైంది. ఆ తరువాత తెరపై కనిపించినా ఆమెను చూసి మురిసిపోవడం కంటే సింపతిని ఎక్కువగా చూపించారు. ఈమెకు సంబంధించిన చిన్న నాటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
చాలా మంది హీరోయిన్లు సినిమాల్లో కనిపించకముందు మోడల్ గా రాణిస్తారు. ఈ భామ కూడా 17 ఏళ్లకే మిస్ సూరత్ గా ఎంపికైంది. ఆ తరువాత తెలుగు సినిమా ‘సొంతం’ తో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికైనా గుర్తొకొచ్చిందా? ఆమె ఎవరోనని. ఆమెనే నమిత. అందాల తార నమిత ప్రస్తుతం తమిళ సినిమాల్లో కనిపిస్తున్నారు.దీంతో ఆమె తమిళ అమ్మాయి అని అనుకుంటారు. కానీ గుజరాత్ లో జన్మించింది. 1998లో మిస్ సూరత్ గా ఎంపికైన నమిత ఆ తరువాత 2001లో మిస్ ఇండియా పోటీల్లో పాల్గొంది. కానీ మూడోస్థానంతోనే సరిపెట్టుకుంది. అయితే ఆ తరువాత పలు యాడ్స్ లోనటించింది.

2002లో తెలుగులో ‘సొంతం’ సినిమా ద్వారా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వెంకటేష్ తో కలిసి ‘జెమిని’ మూవీలో అలరించింది. ఇలా వరుసగా తెలుగు సినిమాల్లోనే నటంచిన నమిత స్టార్ హీరోల పక్కన కూడా నటించింది. అయితే ప్రభాస్ నటించిన ‘బిల్లా’లో కనిపించిన నమిత ఒక్కసారిగా తన ఫిజిక్ మారిపోయింది. అప్పటికే వివిధ అనారోగ్యాల కారణంగా లావుగా అయిన నమిత ఆ తరువాత అమెకు అవకాశాలు దక్కకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంది.
ఆ తరువాత తమిళ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో హౌజ్ లోకి వెళ్లింది. 28 రోజుల పాటు ఉన్న ఆమె తనతో పార్ట్స్ పేట్ చేసిన కంటెస్టెంట్ వీరేంద్ర చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కవలలు జన్మించారు. ఇటీవల బీజేపీలోకి వెళ్లి