Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 పద్నాలుగు వారాలు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుని ఫినాలే లో అడుగుపెట్టింది. ఆదివారం శోభా శెట్టి ఎలిమినేషన్ తో టాప్ 6 కంటెస్టెంట్స్ ఫైనల్స్ కి చేరుకున్నారు. శివాజీ, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అంబటి అర్జున్ అమర్ దీప్ లు హౌస్ లో ఉన్నారు. అయితే వారిలో విన్నర్ ఎవరు అవుతారు. రన్నర్ అప్ గా ఎవరు నిలుస్తారన్న అంశాలు ఉత్కంఠగా మారాయి.
అయితే గత ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున నవ్వుతూ .. నవ్వుతూ అమర్ విన్నర్ అవ్వడు అనే ఉద్దేశం వచ్చేలా ఒక మాట అన్నాడు. కాగా సండే ఫండే లో భాగంగా ఇంటి సభ్యులతో కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడించారు హోస్ట్. ఇందుకు కొన్ని పాపులర్ మీమ్స్ ఇచ్చి .. అవి ఎవరికి సూట్ అవుతాయో వాళ్లకి పెట్టాలని చెప్పారు. కాగా మెజారిటీ హౌస్ మేట్స్ అమర్ కి ఎక్కువ మీమ్స్ డెడికేట్ చేశారు.
ముఖ్యంగా ” సరి సర్లే .. ఎన్నెన్నో అనుకుంటాం .. అన్ని జరుగుతాయా ఏంటి ” అనే మీమ్ శివాజీ… అమర్ దీప్ కి ఇచ్చాడు. అదే సమయంలో నాగార్జున ఇది నీకు కరెక్ట్ గా సూట్ అవుతుందని అమర్ తో అన్నారు. నువ్వు చాలా అనుకున్నావు అన్ని జరుగుతాయా ఏంటి అంటూ అమర్ ని ఏడిపించారు. సరదాగా అన్నప్పటికీ ఆ మాటను బట్టి చూస్తే అమర్ అనుకున్నది జరగదు అని చెప్పినట్లు తెలుస్తుంది.
అయితే అమర్ కెప్టెన్సీ కోసం ఎంతగా ప్రయత్నించినా కూడా కెప్టెన్ కాలేక పోయాడు. ఆ తర్వాత జరిగిన ఫినాలే అస్త్ర టాస్క్ లో చివరి వరకు వచ్చి ఓడిపోవడంతో .. నాగార్జున కనికరించి నేరుగా కెప్టెన్ ని చేశాడు. ఇప్పుడు అమర్ దృష్టి మొత్తం టైటిల్ పైనే ఉంది. ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. కాగా ఆదివారం నాగ్ అన్న మాటలను బట్టి చూస్తే అతను విన్నర్ అవ్వడని తేలిపోయిందని సోషల్ మీడియా టాక్. నాగార్జున చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.