Udaya Bhanu: బిగ్ బాస్ షో గురించి అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఐదు సీజన్ లు పూర్తి చేసుకుని ఆరో సీజన్ లోకి అడుగుపెట్టబోతోంది. ఇందులోకి వచ్చే వారి కోసం బిగ్ బాస్ భారీ ఆఫర్లు ఇస్తోంది. దీంతో వారు వచ్చేందుకు ఎక్కువగానే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చాలా మందిని రప్పించిన యాజమాన్యం ఇంకా కొంతమందిని తీసుకొచ్చి వారి ద్వారా షోకు ప్రతిష్ట తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సినిమా, బుల్లితెర నటులు, వ్యాఖ్యాతలను పిలిపించి వారితో సందడి చేస్తున్నారు. ఇదే కోవలో ఆరో సీజన్ కోసం బ్రహ్మాండమైన ప్రణాళిక రచిస్తున్నారు.

భారీ పారితోషికం ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదు. చాలా మంది వచ్చినా ఇంకా కొత్తవారిని తీసుకొచ్చి షో కు ప్రత్యేక ఆకర్షణ తేవాలని భావిస్తున్నారు. దీని కోసం చాలా మందిని కలుస్తున్నట్లు కూడా సమాచారం. ఈ నేపథ్యంలో ఒకప్పుడు సినిమా, బుల్లితెర లో ఓ వెలుగు వెలిగిన ప్రముఖ వ్యాఖ్యాత, నటి ఉదయభానును తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రతి సీజన్ లో ఆమెను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నా ఆమె మాత్రం ఒప్పుకోవడం లేదు.
Also Read: Superstar Rajinikanth: అంత స్టార్ డం ఉన్నా రజినీకాంత్ ఎందుకు సంతోషంగా లేడు
ఈ సారి మాత్రం కచ్చితంగా ఆమెను షోకు తీసుకురావడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆమెకు భారీ పారితోషికం ఆఫర్ కూడా ఇస్తున్నట్లు యాజమాన్యం చెబుతోంది. కానీ ఆమె ఎందుకో వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావిస్తుందో ఏమో కానీ రావడానికి వెనకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఈ సారి మాత్రం ఆమెను తీసుకురావడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఉదయభాను పెళ్లి తరువాత టీవీ షోలకు దూరమైనా ఇటీవల కాలంలో కొన్నింట్లో మాత్రం దర్శనం ఇస్తోంది. దీంతోనే బిగ్ బాస్ షోకు రావాల్సిందిగా సూచిస్తున్నారు.

లీడర్ సినిమాలో ఓ ప్రత్యేక పాటలో కనిపించిన ఉదయభాను మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినట్లు భావించారు. కానీ ఈటీవీ షోల్లో మాత్రం ఆమె కనిపిస్తోంది. మిగతా వాటిల్లో తక్కువగానే పాల్గొంటోంది. దీంతో ఆమెను బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా తీసుకొచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఉదయభాను బిగ్ బాస్ కు వస్తే దాని ప్రతిష్ట మరింత ఇనుమడించే అవకాశాలున్నందునే ఆమె రాక కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు. వీరి కోరికను మన్నించి ఆమె వస్తుందా? లేక హ్యాండిస్తుందా అనేదే తేలాల్సి ఉంది. ఇది జరగాలంటే ఆగస్టు రావాల్సిందే. ఆగస్టులోనే కదా ఆరో సీజన్ మొదలయ్యేది.
Also Read:MP Ravikishan: జనాభా కంట్రోల్ బిల్లు.. ఆ నటుడిపై ఆడేసుకుంటున్న నెటిజన్లు
[…] […]