
Manchu Manoj : మంచు మనోజ్ వివాహం ఘనంగా జరిగింది. ఆయన భూమా మౌనికతో ఏడడుగులు వేశారు. మార్చి 3న హైదరాబాద్ లో మంచు లక్ష్మి నివాసంలో మనోజ్-మౌనికల వివాహం జరిగింది. మనోజ్ కి ఇది రెండో పెళ్లి. 2015లో మనోజ్ ప్రణతి రెడ్డి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్లు వీరి దాంపత్యం సవ్యంగానే సాగింది. కారణం తెలియదు కానీ 2019లో విడాకుల ప్రకటన చేశారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయం మనోజ్ అభిమానులకు తెలియజేశారు.
విడాకులు అనంతరం మనోజ్ భూమా మౌనికకు దగ్గరయ్యారు. కొన్నాళ్లుగా సన్నిహితంగా ఉంటున్నారు. వీరి ఎఫైర్ గత ఏడాది బయటపడింది. గణేష్ మండపం వద్ద ఇద్దరూ కలిసి ప్రత్యేక పూజలు చేశారు. దీంతో పెళ్లి రూమర్స్ మొదలయ్యాయి. ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. భూమా మౌనికకు సైతం ఇది రెండో వివాహం. 2016లో గణేష్ రెడ్డి అనే బిజినెస్ మాన్ ని వివాహం చేసుకున్న మౌనిక విడాకులు తీసుకొని విడిపోయారు. వీరికి ధైరవ్ రెడ్డి అనే కుమారుడు ఉన్నాడు. మౌనిక కొడుకు బాధ్యత నాదే అని మనోజ్ ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా ఈ రెండు పెళ్లిళ్ల సెంటిమెంట్ మంచు ఫ్యామిలీలో ఎప్పుడో మొదలైంది. మోహన్ బాబుకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. మొదట ఆయన విద్యాదేవిని వివాహం చేసుకున్నారు. ఆమెకు మంచు లక్ష్మి, విష్ణు పుట్టారు. మోహన్ బాబు కెరీర్లో ఎదుగుతున్న రోజుల్లో విషాదం చోటు చేసుకుంది. విద్యాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో మంచు లక్ష్మి, విష్ణు తల్లిలేని పిల్లలయ్యారు. అప్పుడు మోహన్ బాబు విద్యాదేవి చెల్లైన నిర్మలాదేవిని పెళ్లి చేసుకున్నారు. నిర్మలాదేవి కొడుకే మంచు విష్ణు. అక్క పిల్లలను కూడా నిర్మలాదేవి సొంత పిల్లలుగా పెంచి పెద్ద చేసింది.
కాగా మంచు లక్ష్మికి కూడా రెండు వివాహాలు జరిగాయి. ఆమె మొదటి వివాహం గురించి సరైన వివరాలు లేవు. మంచు లక్ష్మి మొదట ప్రేమ వివాహం చేసుకున్నారనే వాదన ఉంది. అయితే మొదటిభర్తతో ఆమెకు మనస్పర్థలు తలెత్తాయి. పెళ్ళైన కొన్నాళ్ళకు అతనికి విడాకులిచ్చి తండ్రి వద్దకు వచ్చేసింది. అనంతరం వ్యాపారవేత్త ఆండీ శ్రీనివాసన్ తో మంచు లక్ష్మి వివాహం జరిగింది. 2006లో మంచు లక్ష్మి-ఆండీ శ్రీనివాసన్ ల పెళ్లి జరిగింది. వీరికి ఒక అమ్మాయి. మంచు లక్ష్మి సరోగసీ పద్ధతిలో జన్మనిచ్చారు. రెండో పెళ్లి సెంటిమెంట్ మనోజ్ ని కూడా వెంటాడింది.