Ram Charan: సినిమా ఇండస్ట్రీలో ఎవరెవరు ఎలాంటి సినిమాలను చేస్తూ సక్సెస్ లు సాధించినా కూడా మెగా ఫ్యామిలీ లో ఉండే హీరోలు ఎలాంటి సినిమాలు చేస్తున్నారనే ఆసక్తి ప్రతి ఒక్క ప్రేక్షకుడిలో ఉంటుంది. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి కూడా ప్రేక్షకులను ఎప్పుడు నిరాశపరచలేదు. అందువల్లే తన ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు కూడా తనలాగే కష్టపడి ఎదగాలని కోరుకుంటున్నారు. కాబట్టి చిరంజీవి లాగే వాళ్ళు కూడా ఎప్పుడు ప్రేక్షకులను అలరిస్తూ ఉండాలని చాలా మంది ప్రేక్షకులు కోరుకుంటూ ఉంటారు. ఇక ఇదిలా ఉంటే చిరంజీవి తనయుడు అయిన రామ్ చరణ్ పూరి దర్శకత్వంలో వచ్చిన చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమాతోనే హీరోగా ప్రేక్షకులను మెప్పించాడు. ఇక తనకు స్టార్ హీరో అయ్యే లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి అంటూ విమర్శకుల చేత ప్రశంసలను కూడా అందుకున్నాడు. ఇక అలాంటి క్రమంలోనే మగధీర సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకొని రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్టు కొట్టిన హీరోగా చరిత్రలో నిలిచాడు…ఇక ఇదిలా ఉంటే రామ్ చరణ్ ఎన్ని సినిమాలు చేసినప్పటికీ వాళ్ళ అమ్మ అయిన సురేఖ గారికి ఆయన చేసిన సినిమాల్లో ఒక సినిమా అంటే అసలు నచ్చదట. అది ఏ సినిమా అంటే రామ్ చరణ్ మొదటి సారి బాలీవుడ్ లో చేసిన జంజీర్ సినిమా…
ఇది హిందీ, తెలుగు రెండు భాషల్లో తెరకెక్కింది. అయితే తెలుగులో మాత్రం తుఫాన్ పేరుతో దీన్ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం గాని, ఈ సినిమాలోని కథ గాని, ఆ దర్శకుడు సినిమాను తీసిన విధానం గానీ ఏదీ కూడా ఆమె కి అసలు నచ్చలేదట. సినిమా థియేటర్లో సినిమా చూసినప్పుడు మధ్యలో నుంచి బయటికి వెళ్లిపోవాలి అని అనిపించిన సినిమా కూడా ఇదేనట…ఇక ఇప్పటివరకు ఆమె చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సినిమాలను చూస్తూ వస్తుంది. కానీ వాటిలో ఏ సినిమాకి కూడా తను ఇంత ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు అంట.
అందుకే రామ్ చరణ్ తో అవకాశం వచ్చిన ప్రతి సారీ ఒక మాట చెబుతూ ఉంటుందట. అది ఏంటి అంటే నువ్వు నీ కెరియర్ లో ఎలాంటి సినిమా చేసినా పర్లేదు. కానీ తుఫాన్ లాంటి సినిమాలు మాత్రం ఇంకెప్పుడు చేయకు అని తను ప్రేమ గా రామ్ చరణ్ కి చెబుతూ ఉంటుందట. దానికి చరణ్ కూడా నవ్వుతూ ఒకే అమ్మ అని సమాధానం చెబుతూ ఉంటాడట…