Nagarjuna: కింగ్ నాగార్జునను ఇప్పటికీ ఓ భాద వేధిస్తుందట. నాగ చైతన్య దూరమైన క్షణం ఆయన తీవ్ర వేదనకు గురయ్యాడట. గతంలో ఈ సంఘటనను ఆయన గుర్తు చేసుకున్నారు. కీలక వ్యాఖ్యలు చేశాడు. విదేశాల్లో చదువు పూర్తి చేసిన నాగార్జున ఇండియాకు వచ్చాడు. వెంటనే ఆయన పెళ్ళికి ముహూర్తం పెట్టారు. నిర్మాత రామానాయుడు, అక్కినేని నాగేశ్వరరావు వియ్యంకులు అయ్యారు. ఇద్దరిదీ ఒకటే సామాజికవర్గం. సన్నిహిత సంబంధాలు కలిగిన కుటుంబాలు కావడంతో రామానాయుడు తన కూతురిని నాగార్జునకు ఇచ్చి చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు నాగేశ్వరరావు కూడా ఒప్పుకున్నారు.
1984లో రామానాయుడు కూతురు లక్ష్మితో నాగార్జున ఏడడుగులు వేశారు. పెళ్ళైన రెండేళ్లకు నాగార్జున 1986లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన మొదటి చిత్రం విక్రమ్. ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. నాగార్జున-లక్ష్మి వైవాహిక బంధం నాలుగేళ్లు సవ్యంగానే సాగింది. నాగ చైతన్య కూడా పుట్టాడు. కారణం తెలియదు కానీ మనస్పర్థలతో విడిపోయారు. అప్పటికి నాగ చైతన్య నాలుగేళ్ళ పిల్లాడు.
దాంతో నాగ చైతన్య సంరక్షణ తల్లి లక్ష్మికి దక్కింది. రెండో పెళ్లి చేసుకున్న లక్ష్మి కొడుకు నాగ చైతన్యను తీసుకుని చెన్నై వెళ్ళిపోయింది. కొడుకు దూరమైన ఆ క్షణం నాగార్జున గుండె బద్దలైందట. తీవ్ర ఆవేదనకు గురయ్యాడట. అప్పుడప్పుడు నాగ చైతన్య హైదరాబాద్ వచ్చేవాడట. నాగార్జునను కలిసేవాడట. స్కూలింగ్ అయ్యాక నాగ చైతన్య చెన్నై నుండి హైదరాబాద్ కి వచ్చేశాడట. బాల్యంలో నాగ చైతన్య తన వద్ద లేడు. కొడుకును పెంచలేకపోయానే అనే బాధ ఇప్పటికీ నాగార్జునను వెంటాడుతుందట. ఓ సందర్భంలో నాగార్జున గతాన్ని తలచుకుని ఎమోషనల్ అయ్యాడు.
నాగ చైతన్యకు వెంకటేష్, సురేష్ బాబు మేనమామలు అవుతారు. అయినప్పటికీ నాగ చైతన్యను నాగార్జున హీరోగా లాంచ్ చేశాడు. తన వారసుడిగా పరిచయం చేశాడు. 2009లో జోష్ మూవీతో నాగ చైతన్య హీరో అయ్యాడు. నాగార్జున ఆల్ టైం క్లాసిక్ శివ చిత్రాన్ని పోలి ఉంటుంది జోష్. ఆ చిత్రంలో నాగ చైతన్య లుక్స్ విమర్శలపాలయ్యాయి. నాగార్జున అందం చైతన్యకు రాలేదని విమర్శకులు ఎద్దేవా చేశారు. రెండో చిత్రం ఏమాయ చేసావే తో హిట్ కొట్టిన నాగ చైతన్య… ఫేమ్ తెచ్చుకున్నాడు.
Web Title: That is the pain that still haunts nagarjuna
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com