Naga Chaitanya
Naga Chaitanya: హీరో నాగ చైతన్య త్వరలో తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కొంతకాలంగా ప్రొఫెషనల్, ఇంకా పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నాడు. 2021లో సమంతతో విడాకులు అయ్యాయి. అలాగే కెరీర్ పరంగా వరుస ప్లాపులతో ఇబ్బందులు పడుతున్నారు. నాగ చైతన్య నటించిన థాంక్యూ, కస్టడీ డిజాస్టర్ అయ్యాయి. ఇది ఇలా ఉండగా .. నాగ చైతన్య కి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్యకు ఓ స్టార్ హీరో కూతురు షాక్ ఇచ్చిందట. కోట్లు ఇచ్చినా అతనితో నటించను అని తేల్చి చెప్పేసిందట.
నాగ చైతన్య సినిమాల్లో నటించకూడదని నిర్ణయించుకున్నారట వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi Sarathkumar). ఒకప్పటి స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి అన్న సంగతి తెలిసిందే. హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన వరలక్ష్మి, విలన్ గా పాపులారిటీ తెచ్చుకుంది. తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్, క్రాక్, వీర సింహారెడ్డి, యశోద వంటి సినిమాల్లో విలన్ గా నటించిన క్రేజ్ దక్కించుకుంది. కాగా ఆమె నాగ చైతన్య సినిమాలో వచ్చిన ఆఫర్ రిజెక్ట్ చేసిందట. అందుకు సమంతనే కారణం అట.
సమంత – వరలక్ష్మి బెస్ట్ ఫ్రెండ్స్ అట. ఈ క్రమంలో సమంతకు విడాకులు ఇచ్చిన నాగ చైతన్య తో సినిమా చేయను అని చెప్పేసిందట వరలక్ష్మి. కోట్లు ఇచ్చినా సరే అతనితో కలిసి నటించను అని కుండబద్దలు కొట్టిందట. ఈ వార్తలో నిజం ఎంత వరకూ ఉందో తెలియదు కానీ… సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నాగ చైతన్య – సమంత డివోర్స్ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు.
సమంత యాక్టింగ్ కి కాస్త బ్రేక్ తీసుకుంది. హెల్త్ పై పూర్తి శ్రద్ధ తీసుకుంటూ కొత్త ప్రాజెక్ట్స్ ఏమి సైన్ చేయలేదు. ఆమె నటించిన సిటాడెల్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఇక నాగ చైతన్య చందు మొండేటి దర్శకత్వంలో భారీ ప్రాజెక్టు చేస్తున్నాడు. తండేల్ టైటిల్ తో ఇది తెరకెక్కుతుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీగా నిర్మిస్తున్నారు.
Web Title: That heroine will not do it with naga chaitanya no matter how many crores are given
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com