Pushpa 2: స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్(Allu Arjun) సినిమా సినిమాకి వైవిధ్యాన్ని చూపిస్తూ ప్రేక్షకుల్లో మంచి ఆదరణని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా యూత్ లో అయితే ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. ఆర్య సినిమాతో యూత్ ను అట్రాక్ట్ చేసిన ఆయన అప్పటినుంచి ఇప్పటివరకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ను అయితే ఏర్పాటు చేసుకున్నాడు.
ఇక ముఖ్యంగా డ్యాన్స్, ఫైట్లతో ప్రేక్షకుల్లో ఒక చెరగని ముద్ర ను వేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే పుష్ప సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో ఎలాంటి సక్సెస్ ని అందుకుంటాడు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అయితే ఈ సమయంలోనే ఒక విషయం మాత్రం అల్లు అర్జున్ ని అతని ఫ్యాన్స్ ని విపరీతంగా బాధపెడుతున్నట్టుగా తెలుస్తుంది.
అది ఏంటి అంటే ఇంతకుముందు సుకుమార్ డైరెక్షన్ లో చేసిన ఆర్య సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక ఆర్య 2 సినిమా మాత్రం ఫ్లాప్ అయింది. అలాగే పుష్ప సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మరి పుష్ప 2 హిట్ అవుతుందా లేక ఆర్య 2 సెంటిమెంట్ ను రిపీట్ చేస్తు ప్లాప్ అవుతుందా అనేది అర్థం కానీ పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ సెంటిమెంట్ ఏమైనా రిపీట్ అయి ఈ సినిమా మీద దెబ్బ పడుతుందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలను అల్లు అర్జున్ చాలా కేర్ ఫుల్ గా చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.
ఇక అల్లు అర్జున్ అభిమానులైతే సెంటిమెంట్ రిపీట్ అవ్వదు అని వాళ్లకు వాళ్లే సర్ది చెప్పుకుంటున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తుంది అనేది మనం ఖచ్చితం గా అంచనా వేయలేము. ఇక ఈ సినిమా మీద ఆయన అభిమానుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. అయితే పుష్ప సినిమా మాదిరిగా ఉంటే పర్లేదు, కానీ కొంచెం తగ్గినా కూడా ఈ సినిమా తీవ్రమైన విమర్శలను ఎదుర్కొనే అవకాశాలు అయితే ఉన్నాయి…