Thandel Movie Twitter Review
Thandel Twitter Review : నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీగా నిర్మించారు. తండేల్ చిత్రాన్ని గొప్పగా ప్రమోట్ చేశారు. ఖచ్చితంగా హిట్ కొట్టబోతున్నామని చిత్ర యూనిట్ గట్టి విశ్వాసం వ్యక్తం చేసింది. సాయి పల్లవి హీరోయిన్ కావడం, దేవిశ్రీ సాంగ్స్ ఆకట్టుకోవడం, ట్రైలర్ మెప్పించిన నేపథ్యంలో అంచనాలు పెరిగాయి. మరి తండేల్ మూవీ ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచిందా? ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్ విడుదలైంది. ఇప్పటికే ప్రీమియర్స్ ముగియగా.. టాక్ ఏంటో చూద్దాం..
#Thandel is a passable love story that works well when focused on the feel good and intimate moments between the lead pair but is tiring whenever it shifts the focus to other subplots.
The lead performances by Naga Chaitanya and Sai Pallavi hold this film together along with…
— Venky Reviews (@venkyreviews) February 6, 2025
అక్కినేని నాగ చైతన్య పరాజయాల్లో ఉన్నాడు. ఆయన గత రెండు చిత్రాలు థాంక్యూ, కస్టడీ నిరాశపరిచాయి. దాంతో హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. కార్తికేయ 2 తో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన చందూ మొండేటితో చేతులు కలిపాడు. చందూ మొండేటి-నాగ చైతన్య మంచి స్నేహితులు. అయితే వీరి కాంబోలో గతంలో వచ్చిన సవ్యసాచి ఆడలేదు. మరోసారి వారు కొలాబరేట్ అయ్యారు.
Prathi review lo nee performance gurinchi special ga mention chesthunaru @chay_akkineni babu
For your hardwork you deserve this ❤️
Hit kotteysam happy ga repatinunchi cinema ni enjoy cheyandi antha #Thandel #NagaChaitanya pic.twitter.com/zjbSu4LLIK
— Devadas (@YashwantNani07) February 6, 2025
తండేల్ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సెన్సిబుల్ లవ్ డ్రామా. ఉత్తరాంధ్రకు చెందిన జాలరి యువకుడి పాత్ర చేశాడు నాగ చైతన్య. సాయి పల్లవి ఆయనకు జంటగా నటించింది. లవ్ స్టోరీ అనంతరం ఈ కాంబోలో తండేల్ రెండో చిత్రం. తండేల్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మించారు.
Positive Responses for #Thandel
Congrats to #SaiPallavi & #NagaChaitanya pic.twitter.com/NMZJ0uKBBk
— DJ (@urstrulyDJX) February 6, 2025
తండేల్ మూవీ కథేంటి.. యధార్థ సంఘటనలకు , కొంత కాల్పనికత జోడించి తండేల్ తెరకెక్కించారు. ఘాడంగా ప్రేమించుకున్న ఓ జంట అనూహ్యం ఎడబాటుకు గురి అవుతుంది. చేపల వేటకు వెళ్లిన హీరోని పాకిస్తాన్ కోస్టల్ గార్డ్స్ అరెస్ట్ చేస్తారు. పరాయి దేశంలో జైలుపాలైన ప్రియుడి రాక కోసం ప్రేయసి ఎదురు చూసిన ప్రేయసి ఎంతటి వేదన అనుభవించింది.. అనేది కథ..
The biggest asset of the film is @ThisIsDSP . His background score and songs bring a feel-good vibe, adding depth to the emotional moments. Once again, he proves why he is the best when it comes to love stories.#thandel #thandelsongs
— avengerallyTFI (@avengerallytfi) February 6, 2025
తండేల్ మూవీ చూసిన ఆడియన్స్ ఈ చిత్రం పట్ల పాజిటివ్ గా స్పందిస్తున్నారు. సినిమా బాగుంది. ఒకసారి చూసి ఎంజాయ్ చేయవచ్చని అంటున్నారు. తండేల్ మూవీకి నాగ చైతన్య, సాయి పల్లవిల నటన ప్రధాన ఆకర్షణ, వారిద్దరూ గొప్పగా నటించారు. వారి పాత్రలు సహజంగా సాగుతాయి, అంటున్నారు. తండేల్ మూవీకి దేవిశ్రీ సాంగ్స్ బ్యాక్ బోన్. ఈ మధ్య కాలంలో దేవిశ్రీ ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్ అన్నమాట వినిపిస్తుంది.
దేవిశ్రీ మ్యూజిక్ బాగుంది అట. ఫస్ట్ హాఫ్ మొత్తం దర్శకుడు రొమాంటిక్ లవ్ డ్రామాతో నడిపించాడు. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అయితే సెకండ్ హాఫ్ ఒకింత నిరాశపరుస్తుంది. ఇండియా-పాకిస్తాన్ రైవల్రీ, హీరో అరెస్ట్ అయ్యాక, పాకిస్తాన్ ఎపిసోడ్స్ అసహజంగా ఉంటాయి. ఆకట్టుకోవు అని ప్రేక్షకుల భావన. మూవీ చివరి 20 నిమిషాలు… మరలా పుంజుకుంటుంది. మొత్తంగా తండేల్ మూవీ బాగుంది. ఒకసారి సరదాగా చూడొచ్చు. భారీ అంచనాలతో మాత్రం వెళ్లొద్దు అంటున్నారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Thandel movie twitter review in telugu is naga chaitanya sai pallavi hits
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com