Thaman on OG Movie: సరిగ్గా మరో రెండు వారాల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ఓజీ'(They Call Him OG) చిత్రం కనీవినీ ఎరుగని భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ ప్రాంతాల్లో మొదలైంది. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ చిత్రానికి 15 లక్షల డాలర్లు వచ్చాయి. థియేట్రికల్ ట్రైలర్ లేకుండా ఒక సినిమాకు ఈ రేంజ్ గ్రాస్ రావడం అనేది ఈ చిత్రానికే జరిగింది. కేవలం నార్త్ అమెరికా లో మాత్రమే కాదు, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, నెథర్లాండ్ మరియు ఇతర దేశాల్లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ టైం రికార్డు దిశగా ముందుకు వెళ్తుంది. ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ స్టామినా తో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్స్ మాత్రమే, థియేట్రికల్ ట్రైలర్ తర్వాత ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి.
ఈమధ్య కాలం లో మన టాలీవుడ్ నుండి ఈ రేంజ్ అంచనాలు ఏర్పాటు చేసుకున్న సినిమాలే రాలేదు అనొచ్చు. అయితే ఈ అంచనాలను చూసి భయపడే అభిమానులు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు భారీ అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్ సినిమాలు అత్యధిక శాతం ఫ్లాప్ అయినవే ఉన్నాయి. మీడియం రేంజ్ అంచనాల నడుమ విడుదలైన సినిమాలే పెద్ద హిట్ అయ్యాయి. పైగా ఆయన గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో గతం లో పంజా మరియు బాలు సినిమాలు చేసాడు. ఈ రెండు సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఇప్పుడు మళ్లీ గ్యాంగ్ స్టర్ రోల్ లోనే పవన్ కళ్యాణ్ మరోసారి కనిపించబోతున్నాడు. ఇది కూడా ఆ రెండు సినిమాల కోవలోకి చెందుతుందా?, లేదంటే ఆ సెంటిమెంట్ ని బ్రేక్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.
అయితే ఈ చిత్రానికి సంగీతం అందించిన తమన్(SS Thaman) అనేక ఇంటర్వ్యూస్ లో ఓజీ గురించి ఎంత గొప్పగా చెప్పాడో మనమంతా చూశాము. ఇది మా తెలుగు సినిమా అని ప్రతీ ప్రేక్షకుడు మీసం మెలి వేసేలా ఈ చిత్రం ఉంటుందని చెప్పుకొచ్చేవాడు. కానీ రీసెంట్ గా ఒక ఈవెంట్ లో పాల్గొన్న ఆయన్ని మీడియా విలేఖరులు ‘ఓజీ’ చిత్రం ఔట్పుట్ ఎలా వచ్చింది అని అడగ్గానే తమన్ నవ్వుతూ ‘గాడ్ ఈజ్ గ్రేట్’ అని అంటాడు. అంటే దీని అర్థం ఏంటి?, సినిమా బాగా రాలేదు, దేవుడి మీదనే భారం మొత్తం వేసాం అంటున్నాడా?, లేదంటే సినిమా ఔట్పుట్ ని చూసిన ఆనందం లో దాని గురించి మాటలు చెప్పడం సరిపోక ఇలా అంటున్నాడా అని అభిమానులు కన్ఫ్యూజన్ లో పడ్డారు. కానీ తమన్ బాడీ లాంగ్వేజ్ ని బట్టీ చూస్తుంటే ఆయన ఆనందం తో మాటలు చెప్పలేక ఇలా మాట్లాడాడు అని అనిపిస్తుంది. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏమి మాట్లాడుతాడో చూడాలి. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి తమన్ స్పీచ్ ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.
GOD IS GREAT.#TheyCallHimOG #Pawankalyan #thaman pic.twitter.com/ZPIGlGgKkk
— Origin~all in~fluencer (@legitspeaker91) September 10, 2025