Homeఎంటర్టైన్మెంట్Thaman NTR Movie: థమన్ కోసం పట్టుబట్టిన ఎన్టీఆర్

Thaman NTR Movie: థమన్ కోసం పట్టుబట్టిన ఎన్టీఆర్

Thaman NTR Movie: కూల్ డైరెక్టర్ కొరటాల శివ ఎన్టీఆర్ తో ఓ పాన్ ఇండియా సినిమా చేయాలని కమిట్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఎన్టీఆర్ కెరీర్‌లో 30వ మైలురాయిగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ ను మొదట ఖాయం చేశారు. కానీ, ఇప్పుడు ఈ నిర్ణయం మారింది అని తెలుస్తోంది. సంగీత సంచలనం థమన్.. ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నాడు.

Thaman NTR Movie
Jr NTR

ప్రస్తుతం సౌత్‌ ఇండస్ట్రీలో థమన్ అంటే సంగీతాభిమానులు చెవి కోసుకుంటున్నారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ సూపర్‌ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఏప్రిల్ 7న ముహూర్తం ఉంటుందని తెలుస్తోంది. నిజానికి థమన్ మొదటే ఈ సినిమాకు కమిట్ అవ్వాలి. కానీ, కొన్ని కారణాల కారణంగా అప్పుడు ఈ కాంబినేషన్ మిస్ అయింది. ఎట్టకేలకు ఇప్పటికి సెట్ అయింది. కారణం ఎన్టీఆర్ అని తెలుస్తోంది.

Also Read:   రామ్ కి అమ్మగా మారబోతున్న ముచ్చర్ల అరుణ

ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ చేయాలని ఎన్టీఆర్ పట్టుబట్టి అతనికి ఛాన్స్ ఇప్పించాడట. అన్నట్టు ఈ సినిమా పై మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉందని.. ఆ పాత్ర ఎన్టీఆర్ కి సవతి తల్లి పాత్ర అని సమాచారం. అయితే, ఆ పాత్రలో సీనియర్ హీరోయిన్ రాధ నటించబోతుందని టాక్ నడుస్తోంది. గతంలో ఇదే పాత్రలో శోభన నటిస్తోంది అని రూమర్ వినిపించింది.

Thaman
Music Director Thaman

ఇప్పుడు రాధ పేరు వినిపిస్తోంది. అంతకు ముందు ఆ పాత్రలో ఒకప్పటి మరో స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్ ను తీసుకోవాలనుకున్నారు. మొత్తానికి ఈ పాత్ర పై అనేక పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. కాగా సుధాకర్ మిక్కిలినేని, కళ్యాణ్ రామ్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే నెల నుంచి ఈ సినిమా షూట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు.

Also Read:  పవన్ కళ్యాణ్ మరో కేజ్రీవాల్ కాగలరా?

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular