Goat Trailer: హీరో విజయ్ ఫ్యాన్స్ కి ది గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) చాలా ప్రత్యేకం. కారణం విజయ్ కి ఇదే చివరి చిత్రం కావచ్చు. విజయ్ రాజకీయ ప్రవేశం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన పార్టీని ప్రకటించారు. తమిళ వెట్రి కజగం ఆయన స్థాపించిన పార్టీ పేరు. సంస్థాగతంగా ఈ పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నాడు. అభిమాన సంఘాలతో ఆయన భేటీ అవుతున్నారు. తమిళనాడు సీఎం పీఠం అధిరోహించడమే లక్ష్యంగా విజయ్ పని చేస్తున్నాడు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేయలేదు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమిళగ వెట్రి కజగం పార్టీ బరిలో దిగనుంది. ఈ క్రమంలో ఇకపై సినిమాలు చేయనని విజయ్ ప్రకటించారు. ఆయన పూర్తిగా ప్రజాసేవకు అంకితం కావాలని కోరుకుంటున్నాడు. రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలి అంటే తీవ్రంగా కష్టపడాలి. ప్రచారం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. విస్తృతంగా పర్యటించనున్నారు.
కాబట్టి విజయ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించేది ది గోట్ లో మాత్రమే కావచ్చు. ది గోట్ సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ విడుదల చేశారు. దాదాపు మూడు నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ ఆసక్తిగా సాగింది. యాక్షన్ ఎపిసోడ్స్, విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి. గోట్ మూవీలో భారీ క్యాస్ట్ నటించారు. ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, లైలా, జయరామ్, అజ్మల్ అమీర్, వైభవ్, యోగిబాబు ఇలా లెక్కకు మించిన స్టార్ క్యాస్ట్ ఉన్నారు.
విజయ్ కి జంటగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ది గోట్ చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకుడు. ది గోట్ మూవీ ట్రైలర్ పరిశీలిస్తే మనకు కథపై ఒక అవగాహన వస్తుంది. విజయ్ డ్యూయల్ రోల్ చేశాడు. ఆయన తండ్రి కొడుకులుగా రెండు భిన్నమైన వయసులతో కూడిన రోల్స్ లో కనిపించనున్నారు. గాంధీ(విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ లీడర్. 60 కి పైగా ఆపరేషన్స్ సక్సెస్ఫుల్ గా ముగించిన సమర్ధుడు. డేంజరస్ స్పై ఏజెంట్.
ఈ క్రమంలో విలన్స్ గాంధీ పై పగబడతారు. గాంధీని, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తారు. గాంధీ కొడుకు(విజయ్) తాగుబోతు. లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తండ్రికి ప్రమాదం ఉందని తెలిసిన కొడుకు ఏం చేశాడు? ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గ్రూప్ ని గాంధీ, అతని కొడుకు కలిసి ఎలా ఎదుర్కొన్నారు? అన్నది కథ. ప్రభుదేవా, ప్రశాంత్, జయరాం గాంధీతో పని చేసే టీం సభ్యుల పాత్రలు చేశారు.
సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్స్ అనేది సినిమాకు హైలెట్. విజయ్ రెండు పాత్రల్లో భిన్నంగా కనిపిస్తున్నారు. ఏఐ సాంకేతికతతో విజయ్ ని యంగ్ గా సైతం ప్రజెంట్ చేశారు. కొడుకు పాత్రలో సస్పెన్స్ ఎలిమెంట్ ఉందనిపిస్తుంది. దాదాపు ఓ హాలీవుడ్ చిత్రాన్ని తలపిస్తుంది. యువన్ శంకర్ రాజా బీజీఎమ్ పర్లేదు అని చెప్పాలి. హీరోయిన్ మీనాక్షి చౌదరిని ట్రైలర్ లో హైలెట్ చేయలేదు. ఆమె పాత్ర ఏమిటనేది చూడాలి…
Web Title: Thalapathy vijay the goat telugu trailer these are the highlights
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com