Jana Nayagan Shooting Controversy: గత ఏడాది సెప్టెంబర్ 27 న తమిళనాడు లోని కరూర్ లో జరిగిన తొక్కిసలాట ఘటనలో 41 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) స్థాపించిన TVK పార్టీ సభకు కెపాసిటీ కి మించి జనాలు రావడం తో జరిగిన ఘటన ఇది. ఈ ఘటన తర్వాత తమిళనాడు రాజకీయాల ముఖ చిత్రమే మారిపోయింది. విజయ్ సొంత అభిమానుల నుండే వ్యతిరేకత ఎదురుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన జరిగిన నాలుగు రోజులకు కానీ ఆయన రెస్పాన్స్ ఇవ్వలేదు. అంతే కాదు, తప్పు మొత్తం ప్రభుత్వం పైనే నెట్టేశాడు. చెప్పిన సమయానికి సభ స్థలం వద్దకు విజయ్ చేరుకోకపోవడం వల్లే ఈ దారుణమైన ఘటన జరిగింది. పైగా ఆ సభ స్థలం కూడా చాలా చిన్నది.
అయితే ఇప్పుడు ఈ ఘటన పై ఒక నేషనల్ మీడియా ప్రచారం చేసిన కథనం పెద్ద దుమారమే రేపుతోంది. ఇదే నిజమైతే విజయ్ రాజకీయ జీవితం సర్వ నాశనం అయ్యినట్టే , అంతే కాదు, ఆయన మిగిలిన జీవితం జైలులో గడపాల్సిందే. ఆ నేషనల్ మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం విజయ్ ఆరోజున సభ స్థలం కి ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం గా వచ్చాడని, ఆ;ఆ రావడానికి కారణం, ఆయన హీరోగా నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ షూటింగ్ కోసం కొన్ని ధ్రోన్ షాట్స్ ని చిత్రీకరించడం కోసమే అని, విజయ్ తన మూవీ టీం ని కూడా సభ స్థలం పరిసరాల్లోకి వచ్చేలా చేసాడని అంటున్నారు. అంతే కాదు, ఈ ఘటన జరిగిన సమయం లో , విజయ్ ప్రేయసి త్రిష కూడా ప్రచార బస్సులోనే ఉందట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో సంచలనం రేపుతున్న అంశం.
అయితే ఇదంతా DMK పార్టీ నేతలు అల్లిన కథ అని , ఇందులో ఎలాంటి నిజం లేదని చెప్పుకొస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. సభ స్థలం చిన్నది గా ఉండడం వల్లే, భారీ జనాలు సరిపడే సభా స్థలం ని ఎంచుకున్నామని, కానీ పోలీసులు అక్కడ సభ ని నిర్వహించుకునేందుకు అనుమతిని ఇవ్వలేదని, ఆ కారణంగానే ఇలాంటి పరిస్థితిని ఎదురుకోవాల్సి వచ్చిందని , ఇదంతా ప్రభుత్వం వేసిన స్కెచ్ లాగానే ఉందంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి వీటిలో ఏది నిజముందో సిబిఐ మాత్రమే తేల్చగలదు. రీసెంట్ గానే పలు మార్లు సిబిఐ విచారణ కు కూడా విజయ్ హాజరు కావాల్సి వచ్చింది. మరి ఈ అంశం రాబోయే రోజుల్లో విజయ్ పొలిటికల్ జర్నీ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి