Tere Ishq Mein: తమిళ్ సినిమా ఇండస్ట్రీ లో ఎవరితో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న హీరో ధనుష్… ఆయన నుంచి ఒక సినిమా వచ్చింది అంటే చాలు ఆ సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుందనే ధోరణిలో ప్రతి ఒక్క ప్రేక్షకుడు సైతం ఆశిస్తుంటారు. ఇక ఇప్పుడు ‘తేరే ఇష్క్ మే’ అనే సినిమాను చేశాడు…ఆనంద్ లాయ్ రాయ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక నవంబర్ 28వ తేదీన ఈ సినిమా తెలుగు,తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ అవుతుండటం విశేషం… ధనుష్ ఆనంద్ లాయ్ రాయ్ కాంబినేషన్లో ఇంతకు ముందు ‘రంజనా’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా 2013లో రిలీజ్ అయి సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక అప్పటినుంచి వీళ్ళ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కలేదు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరో సినిమా రావడం అనేది అందరిని ఆకట్టుకుంటుంది. ఆనంద్ డైరెక్షన్ లో వచ్చే సినిమాలు చాలా సెన్సిబుల్ ఇష్యూష్ తో ఉంటాయనే విషయం మనందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ గా తెరకెక్కడమే కాకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని సినిమా యూనిట్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇక రీసెంట్ గా సెన్సార్ బోర్డు సభ్యులు సైతం ఈ మూవీని చూసి యూబైఏ(U/A) సర్టిఫికెట్ ఇచ్చారు. ఇక సెన్సార్ సభ్యులు సైతం సినిమా బాగా వచ్చిందని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక అందులో భాగంగానే కొన్ని షాట్స్ కి కూడా కట్స్ విధించినట్టుగా తెలుస్తోంది.
మరి ఆ విషయంలోనే దర్శకుడు హీరో కొంతవరకు అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికి మొత్తానికి కొన్ని కట్స్ తో సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమాకి సర్టిఫికెట్ ఇవ్వడం అనేది చాలా వరకు కలిసి వచ్చే అంశమనే చెప్పాలి. ఇక డైరెక్టర్ మాత్రం సెన్సార్ వాళ్ళు కట్ చేసిన సీన్స్ ఈ మూవీ కి చాలా కీలకమని భావిస్తున్నాడట… ఇక ధనుష్ సైతం మరోసారి తన సత్తాను చాటుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంతకుముందు ‘కుబేర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఇక ఈ సినిమాతో కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తే పాన్ ఇండియాలో మరోసారి తనను తాను ఎలివేట్ చేసుకున్న వాడవుతాడు… లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు… ఈ సినిమా రిలీజ్ కి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీ అంచనాలైతే పెట్టుకున్నారు. ఇక వాళ్ళ అంచనాలను తగ్గట్టుగానే ఈ సినిమా ఉంటుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది గంటలపాటు వెయిట్ చేయాల్సిందే…