Telugu OTT Platforms: ఏపీలో థియేటర్ల వ్యవస్థ ప్రస్తుతం అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఓటీటీ సంస్థలు మళ్ళీ ఫామ్ లోకి వచ్చేలా కనిపిస్తున్నాయి. కానీ, అందుకు బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకుంటారా ? అనేది డౌట్. వాళ్ళంతా బిజినెస్ కోల్పోయి ఆందోళనలో ఉన్నారు. కానీ, ఎవరు ఏమి చేయలేని పరిస్థితి. ఏపీలో జగన్ తీరు, సినిమా మనుగడకే కష్టంగా మారింది.

తగ్గిన టికెట్ రేట్లకు కాంప్రమైజ్ అయి సినిమాలు రిలీజ్ చేసినా నష్టాలే మిగులుతాయి. కాబట్టి.. ఏ రకంగా చూసుకున్నా ఇప్పుడు అందరి చూపు ఒక్కటే ఉంది. ఓటీటీ వైపే. నిజానికి కరోనా క్లిష్ట సమయంలో ప్రేక్షకులను అలరించింది, నిర్మాతలకు లాభలను తెచ్చి పెట్టింది ఒక్క ఓటీటీ సంస్థలే. కానీ, బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ ఓటీటీలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు.
Also Read: Pan India Movies: జనవరి 2 తర్వాతనే పాన్ ఇండియా సినిమాలపై తుది నిర్ణయం
థియేటర్లు అందుబాటులో లేనప్పుడు, బయ్యర్ల కష్టాలను ఆలోచించి అసలుకే ఎసరు తెచ్చుకునే ఆలోచనలో నిర్మాతలు లేరు. ప్రభుత్వం నిర్లక్ష్యం కావొచ్చు, పగ కావొచ్చు.. ఏ రకంగా చూసుకున్నా.. రానున్న రెండేళ్లలో తెలుగు సినిమా ఇండస్ట్రీ మరిన్నీ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. కాబట్టి, సినిమా అనేది వ్యాపారం.. బిజినెస్ లో లాభం ఎక్కడ ఉంటే.. అందరూ అక్కడికే వెళ్ళాలి.
అందుకే, ప్రస్తుతం కరోనా మూడో వేవ్ కూడా రాబోతుంది కాబట్టి.. చాలామంది నిర్మాతలు థియేటర్స్ వైపు చూస్తున్నారు. ఎలాగూ మూడో వేవ్ వస్తే.. థియేటర్ల మొహం కూడా జనం చూడటానికి ఆసక్తి చూపించరు. అందుకే, తమ సినిమాలను ఓటీటీలకు అమ్ముకోవడానికి కసరత్తులు చేస్తున్నారు. ప్రతి వారం ప్రతి ఓటీటీ ప్లాట్ ఫామ్ కొత్త కంటెంట్ తో వస్తోంది.
Also Read: Vijay Devarakonda: తన కెరీర్లో మరో ఘనత సాధించిన టాలీవుడ్ రౌడీ విజయ్!
విభిన్న చిత్రాలు, వినూత్న వెబ్ సిరీస్ లను గానీ మేకర్స్ ప్లాన్ చేస్తే.. కచ్చితంగా ఓటీటీ సంస్థలు వాటిని కొనుక్కోవడానికి ఆసక్తి చూపిస్తాయి. అందుకే, ప్రముఖ నిర్మాతలు అంతా కలిసి గిల్డ్ నుంచి ఓ టికెట్ ఓటీటీని కూడా ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నారట. అంటే.. టికెట్ ఆన్ లైన్ లో కొనుక్కుని లాగ్ ఇన్ అయి సినిమా చూడటం. సినిమా బతకడానికి ఈ కొత్త ఓటీటీ ప్రపంచానికి తెరలేపారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.