Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు భారీ బడ్జెట్ తో సినిమాలను తీస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియాలో మన స్టార్ హీరోలు(Star Heros)నెంబర్ వన్ పొజిషన్ ను కైవసం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్తా చాటుకోవాల్సిన స్టార్ హీరోలు అందరూ వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. మరి ఇలాంటి సందర్భంలోనే భారీ బడ్జెట్ సినిమాలను తీసి భారీ కలెక్షన్లను రాబడితేనే వాళ్ళు స్టార్లుగా మరో మెట్టు పైకెక్కుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
ప్రస్తుతం తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు అందరూ మంచి సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా మంచి సినిమాలను చేసి ప్రొడ్యూసర్స్ (Producers) ప్రమోషన్స్ ని కూడా భారీ రేంజ్ లో చేపడుతూ సినిమాల మీద హైప్ ను చేపడుతున్నారు. కానీ ఒక సినిమా ప్రీమియర్ షో (Premiere Show) లేదంటే బెనిఫిట్ షో(Benfit Show) వచ్చిన వెంటనే రివ్యూవర్స్ ఆ సినిమా ఇలా ఉంది అలా ఉంది అంటూ ఆ మూవీని పోస్ట్ మార్టం చేస్తూ రివ్యూస్ ఇవ్వడం వల్ల సినిమా థియేటర్ కి ఎవరూ రావడం లేదు. అనేది ప్రొడ్యూసర్ల వాదన నిజానికి సినిమాలో కంటెంట్ ఉంటే ఎవరైనా సినిమా చూడడానికి వస్తారు అంటూ వాళ్ల సమాధానాన్ని చెబుతున్నారు.
అన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీసి భారీగా పాజిటివ్ ప్రమోషన్స్ చేసుకున్న తర్వాత రివ్యూవర్స్ఈ నెగెటివ్ కామెంట్స్ ను చూసి చాలా మంది జనాలు వాళ్ళ మైండ్ సెట్ ని మార్చుకుంటున్నారు. అయితే ఈ సమయం లోనే ప్రొడ్యూసర్స్ రివ్యూవర్స్ మీద కొంతవరకు ఫైర్ అవుతున్నారు. ఇక రివ్యూవర్స్ మాత్రం ప్రొడ్యూసర్స్ ను తప్పుబడుతూ మీరు అన్ని కోట్లు పెట్టి సినిమాలను తీసి టికెట్ రేట్ ను పెంచడం వల్ల ఒక సామాన్య జీవితాన్ని గడిపే ఒక కుటుంబం తన శాలరీలో సగం జీతం మొత్తాన్ని టికెట్ల మీద కేటాయించి సినిమాకి వెళ్తున్నారు.
అలాంటి వారు సినిమా ఎలా ఉంది అనేది తెలుసుకొని బాగుంటే వెళ్దాం లేదంటే ఆగిపోదాం అని ఆలోచించడంలో తప్పైతే లేదు. అలాంటి వారు మా రివ్యూ ని ఫాలో అవుతారు. అంటూ రివ్యూవర్స్ సమాధానం చెబుతున్నారు. మరి మొత్తానికైతే ఇక్కడ ప్రొడ్యూసర్స్ కి రివ్యూవర్స్ కి మధ్య కొంత కాంట్రవర్సీ ఇష్యూ అయితే నడుస్తుంది. ఇక రీసెంట్ గా గేమ్ చేంజర్ సినిమా యావరేజ్ గా ఉన్నప్పటికి దానికి డిజాస్టర్ టాక్ తెప్పించింది మాత్రం రివ్యూవర్స్ అంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా సినిమాలను అన్ని కోట్లు పెట్టి తీస్తే రివ్యూవర్స్ జస్ట్ సింపుల్ గా ఆ సినిమా అలా ఉంది ఇలా ఉంది అంటూ రివ్యూ ఇచ్చేసి సినిమాలను దెబ్బ కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఈ ఇష్యూ ఎక్కడ దాకా వెళ్తుంది అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…