Manasa Varanasi background: వాలెంటైన్స్ డే సందర్భంగా ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని థియేటర్స్ లో విజయవంతంగా రన్ అవుతున్న చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ'(Couple Friendly). సంతోష్ శోభన్(Santosh Sobhan), మానస వారణాసి(Manasa Varanasi) హీరో హీరోయిన్లు గా ఈ చిత్రం లో నటించారు. వీళ్లిద్దరి నటనకు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ మానస వారణాసి గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. చూసేందుకు అమ్మాయి చాలా ముచ్చటగా ఉంది, ఎక్కడ నుండి ఈమెని తీసుకొచ్చారు అంటూ ఆమె గురించి గూగుల్ లో వెతకడం మొదలు పెట్టారు నెటిజెన్స్. అలా వెతకగా ఆమె గురించి తెలిసిన కొన్ని షాకింగ్ నిజాలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అసలు ఎవరు ఈ అమ్మాయి?, ఏ ప్రాంతానికి చెందింది?, ఇప్పటి వరకు చేసిన సినిమాలేంటి అనేది వివరంగా చూద్దాం.
మానస వారణాసి 1997 వ సంవత్సరంలో మార్చి 21న హైదరాబాద్ లో జన్మించింది. ఈమె తల్లి పేరు శైలజ, తండ్రి పేరు రవి శంకర్. అచ్చ తెలుగు అమ్మాయిగా ఈమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. అయితే తానూ చిన్నతనం లో ఉన్నప్పుడు తన తండ్రికి మలేషియా లో ఉద్యోగం రావడం తో హైదరాబాద్ వదిలి మలేషియా కి వెళ్లాల్సి వచ్చింది. గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో పదవ తరగతి వరకు చదువుకుంది. ఆ తర్వాత ఇండియా కి తిరిగొచ్చి ఇంటర్మీడియట్ ని పూర్తి చేసిన మానస, హైదరాబాద్ లోని వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ లో కంప్యూటర్ సైన్స్ ని పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాద్ లోని ఫాక్ట్ సెట్ అనే కంపెనీ లో ఫైనాన్షియల్ ఇంఫర్మేషన్ ఎక్స్ చేంజ్ అనలిస్ట్ గా కొన్నాళ్ళు ఉద్యోగం చేసింది. అంతే కాదు ఆమె కాలేజ్ లో చదువుతున్న రోజుల్లో మిస్ ఫ్రెషర్ టైటిల్ ని కూడా గెలుచుకుంది.
అయితే కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత, ఫ్యాషన్ రంగం లోకి అడుగుపెట్టింది. 2020 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్న మానస వారణాసి, మిస్ ఇండియా టైటిల్ ని గెలుచుకుంది. అంతకు ముందు ఆమె మిస్ వరల్డ్ 2019 పోటీల్లో పాల్గొని రన్నరప్ గా నిల్చింది. అలా ఒక తెలుగు అమ్మాయి, మన ఇండియా తరుపున మిస్ ఇండియా పోటీల్లో పాల్గొనడమే కాకుండా, రన్నర్ గా నిలవడం అనేది సాధారణమైన విషయం కాదు. అంతటి పేరొందిన ఈమెకు 2024 వ సంవత్సరం లో ‘దేవకీ నందన వాసుదేవ’ అనే చిత్రం లో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈమె చేసిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ లేటెస్ట్ గానే రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది.