https://oktelugu.com/

NTR Awards : “ఎన్ టీ ఆర్ అవార్డ్స్”కు వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లో స్థానం!!

ముఖ్య అతిథిగా, అవార్డు గ్రహీతగా విచ్చేసిన మురళి మోహన్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఇంతమందిని ఒక వేడుకలో భాగస్వామ్యం చేయడం ఎంతో కష్టసాధ్యం అయినప్పటికీ యుగపురుషుడు ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ సంస్థలు ఈ కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించారని అన్నారు

Written By:
  • NARESH
  • , Updated On : May 30, 2023 5:32 pm
    Follow us on

    -ఘనంగా ఎఫ్ టీ పీ సీ – తెలుగు సినిమా వేదిక ఎన్ టీ ఆర్ నేషనల్ లెజెండరీ అవార్డ్స్ వేడుక

    – 101 మందికి ఘన సత్కారం

    NTR Awards : ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్ అఫ్ ఇండియా తెలుగు సినిమా వేదిక సంయుక్తంగా నిర్వహించిన ఎన్ టీ ఆర్ లెజెండరీ నేషనల్ అవార్డ్స్ వేడుక ఎల్ వీ ప్రసాద్ ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరిగింది. 8 రాష్ట్రాలకు చెందిన సినీ సామాజిక ప్రముఖులకు అందించిన ఈ పురస్కార వేడుకకు సీనియర్ నటులు మురళి మోహన్, కోట శ్రీనివాస రావు, బాబు మోహన్, ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, జెన్కో చైర్మన్ ప్రభాకర రావు, ఎఫ్ డి సి చైర్మన్ అనిల్ కూర్మాచలం, సినీ ప్రముఖులు బసిరెడ్డి, దామోదర్ ప్రసాద్, కాశీ విశ్వనాధ్, ఎన్టీఆర్ మనవడు నందమూరి యశ్వంత్, గౌతమ్ రాజు తదితరులు విచ్చేసి గ్రహీతలకు అవార్డులను బహూకరించారు.

    ముఖ్య అతిథిగా, అవార్డు గ్రహీతగా విచ్చేసిన మురళి మోహన్ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఇంతమందిని ఒక వేడుకలో భాగస్వామ్యం చేయడం ఎంతో కష్టసాధ్యం అయినప్పటికీ యుగపురుషుడు ఎన్టీఆర్ పై అభిమానంతో ఈ సంస్థలు ఈ కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో నిర్వహించారని అన్నారు. నటన సేవా రంగాలలో రామారావు గారు గారు ఎందరికో ఆదర్శ ప్రాయులని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ప్రభాకర్ రావు అభిప్రాయపడ్డారు భారీ స్థాయిలో నిర్వహించిన ఈ వేడుక ఎన్ టీ ఆర్ స్టామినాకు అద్దం పడుతోందని ఎఫ్ డీ సి చైర్మన్ అనిల్ కుర్మాచలం వ్యాఖ్యానించారు.

    రెండున్నర గంటల సమయంలో 101 మందికి అవార్డులను అందజేసిన ఈ వేడుక.. వరల్డ్ బుక్ అఫ్ రికార్డు లో చోటు సంపాదించింది. ఈ ఘనత సాధించిన ఎఫ్ టీ పీ సి సంస్థ అధ్యక్షులు చైతన్య జంగా – కార్యదర్శి వీస్ వర్మ పాకలపాటి లకు వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లండన్ సి ఈ ఓ రాజీవ్ శ్రీవాత్సవ్ సర్టిఫికెట్ ని ప్రదానం చేసారు.

    ఈ కార్యక్రమాన్ని అంగరంగంగా నిర్వహించిన ఎఫ్ టీ పి సి ఇండియా మరియు తెలుగు సినిమా వేదిక సంస్థలను సీనియర్ నటులు కోట శ్రీనివాస్ రావు, బాబు మోహన్, గౌతమ్ రాజు, చిత్ర ప్రముఖులు బసిరెడ్డి, దామోదర్ ప్రసాద్, తుమ్మల ప్రసన్న కుమార్, ఎన్టీఆర్ మనవడు నందమూరి యశ్వంత్ తదితరులు కొనియాడారు. ఈ అవార్డులను ఇతర రాష్ట్రాల సినీ సామాజిక ప్రముఖులతోపాటు తెలుగు సినీ నటులు మురళి మోహన్, కోట శ్రీనివాస్ రావు, బాబు మోహన్, దర్శకులు సురేష్ కృష్ణ, అశోక్, సత్యానంద్, సీనియర్ జర్నలిస్టులు వినాయక రావు, ధీరజ అప్పాజీ, కూనిరెడ్డి శ్రీనివాస్ మరియు అనేక సినీ ప్రముఖులకు ఈ అవార్డులను అందజేశారు!!