Producer Heroes : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నారు. ఇక ఇలాంటి సందర్భంలోనే కొంతమంది హీరోలు మాత్రం వాళ్ళు అనుకుంటున్న సక్సెస్ లను సాధించడంలో ముందుకు దూసుకెళ్తుంటే మరి కొంత మంది మాత్రం డీలా పడిపోతున్నారు. ఇంకా కొంతమంది హీరోలు మాత్రం ప్రొడ్యూసర్స్ హీరోలుగా పేరు సంపాదించుకుంటున్నారు. కారణం ఏంటి అంటే వాళ్లు చేసే మీడియం బడ్జెట్ సినిమాలతో ప్రొడ్యూసర్స్ కి భారీ లాభాలు తెచ్చి పెడుతున్నారు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన ప్రొడ్యూసర్స్ ని మాత్రం సేఫ్ జోన్ లో ఉంచితే వాళ్ళు పెట్టిన డబ్బులు వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. తెలుగులో అలాంటి హీరోల్లో మొదటగా నాని పేరు వినిపిస్తుంది.
ఆయన సినిమాలు మినిమం గ్యారంటి సక్సెస్ లను సాధిస్తాయి. ప్రేక్షకులందరు ఒక్కసారైనా అతని సినిమాలను చూడొచ్చు అనే పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి అతనితో సినిమాలు చేయడానికి చాలామంది ప్రొడ్యూసర్లు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక తనతో పాటుగా నవీన్ పోలిశెట్టి సైతం ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ హీరోగా మారిపోయాడు.
తను ఒక సినిమా కథ ఫైనల్ చేశాడు అంటే కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని ప్రొడ్యూసర్స్ లో ఒక నమ్మకాన్ని కల్పించాడు. కారణం ఏంటి అంటే ఇప్పటివరకు ఆయన చేసిన నాలుగు సినిమాల్లో నాలుగు సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధించాయి… ప్రస్తుతానికి వీళ్లిద్దరు మాత్రమే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ హీరోలుగా కొనసాగుతున్నారు.
ఒకవేళ సినిమాలు తేడా కొట్టిన కూడా వాళ్ళ పేరు మీద బిజినెస్ జరిగి ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే ఉద్దేశ్యంతోనే వీళ్లు ముందుకు సాగుతున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే రాబోయే రోజుల్లో కూడా భారీ విజయాలను సాధిస్తూ వీళ్ళు ఇలాగే ప్రొడ్యూసర్స్ హీరోలుగా కొనసాగుతారా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక ప్రస్తుతం వీళ్లిద్దరిని మినహాయిస్తే మిగిలిన మీడియం రేంజ్ హీరోలందరు ప్లాపుల్లోనే ఉన్నారు…