Telugu Bigg Boss 5: బుల్లితెరపై సంచలనం సృష్టిస్తున్న అతిపెద్ద తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 5 చాలా రసవత్తరంగా సాగుతోంది. టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో రోజులు గడిచే కొద్ది ప్రేక్షకులను చాలా ఉత్కంఠకు గురి చేస్తుంది. ముఖ్యంగా శనివారం, ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్స్ వీక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. దానికి అనుగుణంగానే షో నిర్వాహకులు వీకెండ్ ఎపిసోడ్స్ ని చాలా వినోదాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. ఫలితంగా మంచి ట్ ఆర్ పి రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతుంది.

ఇప్పటికే బిగ్ బాస్ నుండి 3 ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం యూట్యూబర్ సరయు, రెండవ వారం కార్తీక దీపం సీరియల్ ఫేమ్ ఉమాదేవి, మూడో వారం సెలబ్రిటీ లహరి ఎలిమినేట్ అయ్యారు. నాలుగో వారానికి గాను కొరియోగ్రాఫర్ అయిన నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యి తీవ్ర నిరాశ పరిచారు. ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన ఫిమేల్ కంటెస్టెంట్ నటరాజ్ మాస్టరే.
ఈ ఐదో వారంలో ఆదివారం జరగబోయే ఎలిమినేషన్ ప్రక్రియకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ 9 మంది. ఈ సీజన్ మొత్తానికి గాని ఇదే అధికం. పైగా ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వగా మిగిలిఉన్న కంటెస్టెంట్స్ 15 మందే. విశ్వ, హమీదా ఎలిమినేషన్ రిస్క్‌లోకి వెళ్లారు. వారి తో పాటు షణ్ముఖ్ జశ్వంత్, ప్రియా, యాంకర్ రవి, లోబో, వీజే సన్ని, మానస్ నాగులపల్లి, జెస్సీ ఈ వారం నామినేట్ అయ్యారు. మొత్తం తొమ్మిదిమంది ఈ సారి నామినేట్ అయ్యారు.
ఈ వారానికి గాను ఎలిమినేట్ అవ్వడానికి జరిగే ఓటింగ్ ప్రక్రియ సోమవారానికి రాత్రి కే ఓపెన్ అయ్యింది. నామినేట్ అయిన తొమ్మిది మంది కంటెస్టెంట్స్ లలో యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ టాప్ లో నిలువగా… విశ్వ, హమీదా డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరు ఎలిమినేట్ అవుతారనేది అని తెలుసుకోవడానికి ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.