Telugu actors cars: సినీ ప్రపంచంలో ఏది జరిగినా ఓ వింతే! మన హీరోలు ఏం చేసినా అభిమానులకు అదో పెద్ద వార్తే! ఏఏ హీరో ఎంతెంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? ఏఏ హీరో ఏ కార్లో తిరుగుతున్నారు? వాళ్ల ఇల్లు ఎక్కడుంది.. అది ఎంత ఖరీదైంది? ఇలా.. సినిమా వాళ్ల జీవితమంటే అందరికీ ఆసక్తే! ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు ఏఏ కార్లు వినియోగిస్తున్నారు? వాటి రేటెంత? అనే దానిపై చర్చ నడుస్తోంది. ఆ వివరాలు మనమూ తెలుసుకుందామా?

తెలుగు ఇండస్ట్రీ కీర్తి రోజురోజుకూ పతాకస్థాయికి చేరుతోంది. ఒకప్పటితో పోల్చుకుంటే టాలీవుడ్ రేంజ్ ఓ స్థాయిలో పెరిగిపోయింది. మన హీరోలు తీసుకునే రెమ్యూనరేషన్ బాలీవుడ్ హీరోలు సైతం తీసుకోలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు. కొందరు స్టార్ హీరోలు ఒక్కో సినిమాకు 60 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నారు. అయినా.. నిర్మాతలు ఏ మాత్రం తగ్గడం లేదు. స్టార్ హీరోలైతే ప్రారంభంలోనే వసూళ్లు వచ్చేస్తాయనే నమ్మకంతో అడిగినంతా ఇచ్చేస్తున్నారు. ఆ డబ్బులతో విలాసవంతంగా జీవిస్తున్నారు. చిరంజీవి నుంచి మొదలుకొని నాగార్జున, ప్రభాస్, ఎన్టీఆర్ మొదలైన హీరోలంతా.. కోట్ల రూపాయల ఖరీదైన లగ్జరీ కార్లలో చక్కెర్లు కొట్టేస్తున్నారు. వాటి వివరాలేంటో ఓ లుక్కేద్దాం…
టాలీవుడ్ లో ప్రభాస్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేమీ లేదు. బాహుబలి సినిమాతో రెబల్ స్టార్ రేంజ్ దేశమంతా వ్యాపించేసింది. ప్రభాస్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ లో సైతం పోటీ కనిపిస్తోంది. రేంజ్ కి తగ్గట్లే.. ప్రభాస్ లైఫ్ స్టైల్ ఉంటుంది. టాలీవుడ్ లో లగ్జరీ కార్లు ఉపయోగించే హీరోల్లోనూ ప్రభాసే అగ్రస్థానంలో నిలిచారు. ఆయన అత్యధికంగా రూ. 6 కోట్ల విలువైన కారులో తిరిగేస్తున్నారు. ఆ తర్వాత స్థానంలో పవర్ స్టార్ పవన్ కల్యాన్ నిలిచారు. పవన్ కు రూ.4.5 కోట్ల విలువైన కారు ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలిలా…
ప్రభాస్ – లంబోర్ఘిని అనెంటడార్ ఎస్ రోడ్స్టర్ – రూ. 6 కోట్లు
పవన్ కల్యాణ్ – రేంజ్ రోవర్ 3.0 SV ఆటో బయోగ్రఫీ – రూ.4.5 కోట్లు
అక్కినేని నాగ చైతన్య – రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ – రూ. 4.37 కోట్లు
జూనియర్ ఎన్టీఆర్ – లాంబోర్గిని ఉరుస్ – 3.10 కోట్లు
రామ్ చరణ్ – మెర్సిడెస్ మెబాచ్ GLS 600- రూ.2.8 కోట్లు
మహేష్ బాబు – రేంజ్ రోవర్ వోగ్ – రూ.2.6 కోట్లు
అక్కినేని నాగార్జున – మెర్సిడేస్ బెంజ్ G63 AMG – రూ. 2.5 కోట్లు
చిరంజీవి – రోల్స్ రాయిస్ ఫాంటమ్ – రూ. 2 కోట్లు
అల్లు అర్జున్ – వోల్వో XC90 T8 ఎక్సలెన్స్ – 1.6 కోట్లు & రేంజ్ రోవర్ వోగ్ – 2.5 కోట్లు
విజయ్ దేవరకొండ – ఫోర్డ్ ముస్తాంగ్ – రూ. 75 లక్షలు
సినీ రంగుల ప్రపంచంలో లగ్జరీగా బతకడంలో స్టార్ హీరోలెవరూ కాంప్రమైజ్ కావడం లేదు. అందమైన బంగ్లాల నుంచి.. కాస్లీ కార్ల వరకూ ఎందులోనే వెనకడగు వేయడం లేదు. కొందరు హీరోలకైతే కార్లు కొనడం ఓ పిచ్చి. మార్కెట్లో ఏ కార్ వచ్చింది.. దాని ఫీచర్స్ ఏంటి అని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటారు. ధర సంగతి పక్కనబెడితే.. చిరంజీవి వచ్చిన ప్రతీ మోడల్ కారును ఓ రౌండ్ వేయాలని ఆశ పడతారట! భవిష్యత్తులో ఇంకెన్ని లగ్జరీ కార్లు మన టాలీవుడ్ కి చేరబోతున్నాయో!