Actor Maruti Rao: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్వపు మద్రాసు ప్రావిన్సులో ఉండేది. అది 1939 ఏప్రిల్ 14వ తేదీ… విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు గొల్లపూడి మారుతీ రావు. ఆ తర్వాత విశాఖపట్టణం వచ్చి అక్కడే నివాసమున్నారు. చిన్న తనంలో ఎక్కువగా ఊహల్లోనే మారుతీ రావు జీవనం సాగింది. అదే క్రమంలో ఎ.వి.ఎన్ కళాశాల, ఆంధ్ర విశ్వవిద్యాలయంలలో మారుతీరావు విద్యాభ్యాసం ముగిసింది.

మారుతీరావుకి ఉద్యోగం చేయాల్సిన అవసరం వచ్చింది. అది 1959వ సంవత్సరం. అప్పట్లో ఉద్యోగాలు రావడం కొంచెం కష్టంగా ఉన్న సమయం. అయితే, తనలోని రచన మారుతీ రావుకి ఆంధ్రప్రభ దినపత్రికలో ఉప సంచాలకునిగా ఉద్యోగం వచ్చేలా చేసింది. ఆ తర్వాత చిత్తూరులో పత్రిక యొక్క మరో ఎడిషన్ ప్రారంభించినపుడు, అక్కడ సంపాదక వర్గంలో పనిచేశాడు.
ఆ తరువాత రేడియోలో ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపికై, హైదరాబాదుకు మారాడు. మొత్తమ్మీద మొత్తం ఇరవై సంవత్సరాలు పనిచేసి, అసిస్టెంట్ స్టేషను డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశాడు. తరువాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినిమారంగ ప్రవేశం చేశాడు.
మారుతీరావు రాసిన తొలి కథ ఆశాజీవి.
మాటల రచయితగా ఆలయశిఖరంతో మారుతీ రావుకి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఉత్తమ కథా రచయితగా, స్క్రీన్ ప్లే రచయితగా, సంభాషణల రచయితగా, నటుడిగా ఐదు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి.
Also Read: ఆ హీరో చెప్పిన మాటలు నాపై మాములు ప్రభావం చూపలేదు- ప్రియాంక జవాల్కర్
పైగా మారుతీరావును ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు, సన్మానాలు వరించాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. తెలుగు సాహిత్యం వారికి పాఠ్యపుస్తకంగా ప్రతిపాదించారు. ఉత్తమ హాస్యరచనకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ వారి సర్వరాయ మెమోరియల్ బంగారు పతకం అందుకున్నారు.
అయితే, మారుతీరావు గారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2019, డిసెంబరు 12న మరణించారు. ఆయన మరణించే సమయంలో తరుచూ ఓ మాట అనేవారట. చిత్రరంగంలో బహుముఖ ప్రజ్ఞత్వం ఉన్నవాళ్లకు ఏదోక రకంగా అన్యాయం జరిగుతుందని ఆయన ఆవేదన చెందుతూ ఎప్పుడూ చెప్పేవారట.
Also Read: ప్రభాస్ హీరోయిన్ కి వేరే సంపాదన ఉందట !