Anasuya Bharadwaj: బుల్లితెరపై అనసూయ ఓ సంచలనం. చెప్పాలంటే ట్రెండ్ సెట్టర్. తెలుగు యాంకరింగ్ కి గ్లామర్ యాంగిల్ పరిచయం చేసిన అమ్మడు. అనసూయ ముందు తరం యాంకర్స్ హద్దులు మీరు స్కిన్ షో చేసింది లేదు. పొట్టి బట్టల యాంకర్ గా పాప్యులర్ అయ్యారు. జబర్దస్త్ వేదికగా సంచలనాలు చేశారు. జబర్దస్త్ లెజెండరీ కామెడీ షోగా పేరు తెచ్చుకుంది. ఆ షో సక్సెస్ లో అనసూయ పాత్ర ఎంతగానో ఉంది. ఈ క్రమంలో అనసూయ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు.
టెలివిజన్ యాంకర్ ఇంత దారుణంగా ఎక్స్పోజ్ చేయడం సరికాదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అనసూయ మాత్రం పట్టించుకుంది లేదు. పైగా నా దుస్తులు నా ఇష్టం అంటూ కౌంటర్లు ఇస్తుంది. కాగా అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పేశారు. ఆమె నటనపై దృష్టి పెట్టారు. జబర్దస్త్ నుండి బయటకు వచ్చాక ఆ షోపై విమర్శలు చేశారు. కమెడియన్స్ తనపై బాడీ షేమింగ్ కి పాల్పడ్డారంటూ ఆవేదన చెందారు.
ఇకపై యాంకరింగ్ చేసేది లేదని అనసూయ తేల్చి చెప్పింది. బుల్లితెర షోల టీఆర్పీ స్టంట్స్ తన నిర్ణయానికి కారణమని ఆమె వెల్లడించారు. నటిగా బిజీ కావడంతో ఆమె యాంకరింగ్ చేయాల్సిన అవసరం లేదు. బుల్లితెర సంపాదనతో పోల్చుకుంటే వెండితెర సంపాదన చాలా ఎక్కువగా ఉంటుంది. అనసూయ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పడానికి ఇది కూడా ఒక కారణం.
అనసూయ ఈ ఏడాది రంగమార్తాండ, విమానం చిత్రాల్లో నటించారు. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండలో మోడరన్ కోడలిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసింది. ఇక విమానంలో వేశ్య పాత్ర చేసి షాక్ ఇచ్చింది. అనసూయ బోల్డ్ డెసిషన్ మైండ్ బ్లాక్ చేసింది. అనసూయ కీలక రోల్ చేసిన పెదకాపు 1 విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబర్ 29న విడుదల కానుంది.
అనసూయ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ పుష్ప 2. ఈ పాన్ ఇండియా మూవీలో దాక్షాయణిగా మరోసారి అలరించనుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఇండియా వైడ్ ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి.