Homeఎంటర్టైన్మెంట్Adhbutham Movie: ఓటిటీ లో విడుదలకు సిద్దమైన తేజ - శివాని రాజశేఖర్ ల "...

Adhbutham Movie: ఓటిటీ లో విడుదలకు సిద్దమైన తేజ – శివాని రాజశేఖర్ ల ” అద్భుతం ” మూవీ

Adhbutham Movie: ఇంద్ర, కలిసుందాం రా వంటి చిత్రాలలో  బాల నటుడుగా గుర్తింపు పొంది… ఇప్పుడు హీరోగా మారాడు తేజ స‌జ్జా. బాల్యం నుంచే సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించుకున్నాడు ఈ కుర్ర హీరో.  గత కొన్ని ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న తేజ… నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఓ బేబీ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీ లో  సమంత మనవడిగా నటించి మెప్పించాడు తేజ. అయితే ఇప్పుడు మరో అప్డేట్ తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు.

teja-sajja-new-movie-adhbutham-movie-going-to-release-in-ott

తేజ నటిస్తున్న కొత్త సినిమా ” అద్భుతం ” ను ఓటీటీలో  రిలీజ్‌కు సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాల్లో చర్చించు కుంటున్నారు. ప్రముఖ హీరో రాజ‌శేఖ‌ర్ పెద్దమ్మాయి శివాని రాజ‌శేఖ‌ర్… నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవ్వడం విశేషం. బాబు బాగా బిజీ ఫేమ్ మ‌ల్లిక్ రామ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని… చంద్ర‌శేఖ‌ర్ మొగుల్ల నిర్మించారు.

అయితే ప్రశాంత్ వర్మ దర్శకుడిగా జాంబి రెడ్డి అనే చిత్రంలో హీరోగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు తేజ. ఈ సినిమాలో తేజ నటనకు ప్రేక్షకులలో ఆదరణ లభించింది. ఆ తర్వాత మలయాళంలో మంచి విజయం అందుకున్న ఇష్క్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశాడు. ఎస్ రాజు దర్శకత్వంలో ” ఇష్క్  నాట్ ఏ లవ్ స్టోరీ ” పేరుతో తెరకెక్కింది.  ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియా వారియర్ నటించారు. చిత్రంలోని పాటలు మంచి ఆదరణ పొందిన… సినిమాకు  ప్రేక్షకుల ఆదరణ లభించలేదు. ప్రస్తుతం తేజ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో… ” హ‌ను మాన్ ” చిత్రంలో నటిస్తున్నాడు.

Hanu-Man First Look Teaser | The First Original Superhero Film in Telugu | A Prasanth Varma Film

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version