Hanuman Teaser: ప్రస్తుతం ఏ ఇండస్ట్రీ ని తీసుకున్న స్టార్ పవర్ ఉన్న సినిమాలకంటే.. కంటెంట్ బలం ఉన్న సినిమాల్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.. దానికి లేటెస్ట్ ఉదాహరనే కాంతారా చిత్రం..ఇలాంటి స్టార్ కాస్టింగ్ లేకుండా అతి తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని శాసించింది..రెండు కోట్ల గ్రాస్ ఓపెనింగ్ తో ప్రారంభమైన ఈ సినిమా వసూళ్లు ఏకంగా 400 కోట్ల రూపాయిలకు ఎగబాకింది.. ఇప్పుడు కాంతారా సినిమా లాగానే మన టాలీవుడ్ నుండి మరో చిన్న సినిమా భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ సినిమాలకు సవాలు విసరనుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు..ప్రశాంత్ వర్మ దర్శకత్వం లో తేజ సజ్జల హీరో గా నటించిన ‘హను మాన్’ మూవీ టీజర్ నేడు విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా నిలిచింది.. కేవలం 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకేక్కించిన ఈ సినిమా విజుయల్స్ 500 కోట్ల రూపాయిలతో నిర్మితమవుతున్న ప్రభాస్ ‘ఆదిపురుష్’ టీజర్ విజుయల్స్ కంటే అత్యద్భుతంగా ఉన్నాయి.. టీజర్ లో ఉన్న షాట్స్ క్వాలిటీ చూస్తుంటే డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎంత గొప్ప ప్రతిభశాలి అనేది అర్థం అవుతుంది.

పాన్ ఇండియా లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ఆదిపురుష్ కి సవాలు విసరనుండి..కొద్ది రోజుల క్రితం విడుదలైన ఆదిపురుష్ టీజర్ ఎలాంటి ట్రోలింగ్ కి గురైందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు..500 కోట్ల రూపాయిల బడ్జెట్ పెట్టి కార్టూన్ సినిమా తీసారా అని ప్రభాస్ అభిమానులు సైతం పెదవి విరిచారు.. ఈ టీజర్ మీద వచ్చిన ట్రోల్ల్స్ కి బయపడి సంక్రాతికి విడుదల చెయ్యాల్సిన మూవీ ని వచ్చే ఏడాది జూన్ కి వాయుదా వేశారు.. ప్రస్తుతం రీ వర్క్ పేరిట మరో వందకోట్లు అదనంగా ఖర్చు చెయ్యనున్నారు..

ఓం రాత్ ని నమ్ముకునే బదులు ప్రశాంత్ వర్మ ని నమ్ముకొని ఉంటే అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చేవాడని.. హను మాన్ టీజర్ విజువల్స్ అదిరిపోయాయని.. క్వాలిటీ అంటే ఈ రేంజ్ లో ఉండాలి అంటూ ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రాత్ ని ట్విట్టర్ లో ట్యాగ్ చేసి తిడుతున్నారు ప్రభాస్ ఫాన్స్.. ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్స్ ప్రతిభ ముందు బాలీవుడ్ డైరెక్టర్స్ నిలబడలేరని.. దయచేసి టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ డైరెక్టర్స్ ట్రాప్ లో పడొద్దు అంటూ సోషల్ మీడియా లో నేటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.