https://oktelugu.com/

‘బిగ్ బాస్ 4’  కంటెస్టెంట్ల కన్నీటి గాథలు ! 

‘బిగ్ బాస్ 4’  బుల్లి స్క్రీన్ ను ఉరూతలు ఊగించడానికి నిన్న మొదలైపోయింది.  అయితే కంటెస్టెంట్ ల్లో కొంతమంది కష్టాలు వుంటుంటే షాకింగ్ గా అనిపిస్తోంది.  చలాకీ యాంకర్‌గా కనిపించే లాస్య  కొన్ని అసక్తికరమైన విషయాలు చెప్పింది. లక్ష్మీ ప్రసన్న ప్రియాంక లాస్య రెడ్డి అనే తానూ ఇంజనీరింగ్ అయిన తర్వాత ఏదో సాధించాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చి చాల కష్టాలు పడి అనుకున్నది సాధించిందట. ఇక తన ప్రేమ పెళ్లి గురించి చెబుతూ తమది వింత […]

Written By:
  • Neelambaram
  • , Updated On : September 7, 2020 / 04:04 PM IST

    Tearful tales of 'Bigg Boss 4' contestants

    Follow us on

    ‘బిగ్ బాస్ 4’  బుల్లి స్క్రీన్ ను ఉరూతలు ఊగించడానికి నిన్న మొదలైపోయింది.  అయితే కంటెస్టెంట్ ల్లో కొంతమంది కష్టాలు వుంటుంటే షాకింగ్ గా అనిపిస్తోంది.  చలాకీ యాంకర్‌గా కనిపించే లాస్య  కొన్ని అసక్తికరమైన విషయాలు చెప్పింది. లక్ష్మీ ప్రసన్న ప్రియాంక లాస్య రెడ్డి అనే తానూ ఇంజనీరింగ్ అయిన తర్వాత ఏదో సాధించాలనే కోరికతో ఇండస్ట్రీకి వచ్చి చాల కష్టాలు పడి అనుకున్నది సాధించిందట. ఇక తన ప్రేమ పెళ్లి గురించి చెబుతూ తమది వింత లవ్ స్టోరీ అని మొదటగా తామిద్దరం రిజిష్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నామని.. ఆ సమయంలో తన భర్తకు జాబ్ లేదని.. ఒక్క షో చేస్తే రోజుకు మూడు వందలు వచ్చేవని.. అవి రెంటుకు కూడా సరిపోయేవి కాదనిఆ సమయంలో  తానూ పదిరోజులు పస్తులు  కూడా ఉన్నానని  తన కన్నీటి గాధ చెప్పింది లాస్య.  అన్నట్టు ఈ బ్యూటీ  తన జీవితంలో మళ్లీ రెండో పెళ్లి చేసుకుంది.. అది ఎవర్నో కాదు, వాళ్ళ  ఆయన్నే.   అందరి సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకోడం ఎంతో సంతోషంగా ఉందని  అంటూ లాస్య  బిగ్ బాస్ హౌస్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది.
     
    ఇక తెలంగాణ యాస, భాషతో ఫేమస్ అయిపోయిన గంగవ్వ  కూడా బిగ్‌ బాస్ హౌస్ లోకి వచ్చింది.  గయ్యాలిదానిలో, చాదస్తపు అవ్వగానో ఫేమస్ అయిన  గంగవ్వ జీవితంలోని కన్నీటి గాథ  గురించి  బిగ్‌బాస్ వేదికగా పంచుకుంది గంగవ్వ.  తనకు ఐదేండ్లప్పుడు పెళ్లైందని.. ఆ తరువాత తన భర్త  చనిపోయాడని.. అప్పుడు తనను ఎవ్వరూ దగ్గరకు తీసుకోలేదని.. ఆ రోజుల్లో తనకు  తినడానికి తిండి కూడా ఉండేది కాదని అందర్నీ ఏడిపించేసింది.  అలాగే తనకు రూ.8 లక్షల అప్పు ఉండేదని.. మూడేళ్లు కష్టపడి తీర్చానని తన బాధ అంతా చెప్పి  తెలుగు ప్రేక్షకులను  కూడా ఏడిపించేసింది గంగవ్వ.
     
    ఇక మరో కంటెస్టెంట్  దేత్తడి హారిక.  ఫ్రస్టేటెడ్ స్టూడెంట్, మదర్, ఇంటి ఓనర్ ఇలా రకరకాల క్యారెక్టర్లు చేసి  గుక్క తిప్పుకోకుండా తెలంగాణ యాసలో మాట్లాడేసి ఫేమస్ అయిపొయింది ఈ చిన్నది. అన్నట్టు ఈ బ్యూటీకి పెద్దగా కష్టాలు లేవుగాని.. తనకు చిన్నప్పటి నుంచి బిగ్‌బాస్ షో అంటే ఫాంటసీ అట. ఒక్కసారైనా బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాలనే కోరిక ఉండేదట. లక్కీగా తనకు ఈ సారి ఛాన్స్  వచ్చిందని పాప బాగా ఎగ్జైట్ అవుతుంది.  ఒకవేళ ఎవరైనా హౌస్‌ లో నీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావ్? అని హారికను  నాగ్ అడగడంతో అర్ధం అవుతుంది.  ఈ సారి లవ్ ట్రాక్  ఈ పాప ఎకౌంట్ లోనే ఉండబోతున్నాయి అని.