NTR On Siima Awards: 2023 సంవత్సరానికి గానూ సైమా అవార్డ్స్ వేడుక ఘనంగా జరుగుతుంది. దుబాయ్ వేదికగా 15, 16 తేదీలలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుక నిర్వహిస్తున్నారు. సౌత్ ఇండియాకు చెందిన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర ప్రముఖులు అవార్డ్స్ వేడుకలో పాల్గొన్నారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి గానూ ఉత్తమ నటుడు అవార్డుకి ఎంపికైన ఎన్టీఆర్ రెండు రోజుల క్రితమే దుబాయ్ వెళ్లారు. ఇక ఉత్తమ నటుడిగా అవార్డు ప్రకటించిన నేపథ్యంలో వేదికపై ప్రసంగించారు.
ఒక ప్రక్క సోషల్ మీడియాలో ఎన్టీఆర్ మీద తీవ్ర దాడి జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పీచ్ ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ షార్ట్ అండ్ స్వీట్ గా ముగించాడు. అయితే తన ఎదుగుదలకు అభిమానులే కారణం అన్నట్లు మాట్లాడారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ… కొమురం భీముడో పాత్రకు న్యాయం చేయగలని నన్ను నమ్మిన రాజమౌళికి ప్రథమంగా ధన్యవాదాలు. అలాగే నా కో స్టార్, బ్రదర్, డియర్ ఫ్రెండ్ రామ్ చరణ్ సపోర్ట్ కి కృతజ్ఞతలు.
నా అభిమానులు అందరికీ రుణపడి ఉంటాను. వారి ప్రేమకు కృతజ్ఞతలు. నేను క్రింద పడిపోయినప్పుడుడు చేయి అందించి పైకి లేపారు, నా ప్రతి కన్నీటికి వారు కూడా బాధపడ్డారు. నా చిరు నవ్వులో భాగం పంచుకున్నారు. నా అభిమాన సోదరులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.. అని తన స్పీచ్ ముగించారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ఎన్టీఆర్ స్పందించలేదని అతన్ని ఓ వర్గం టార్గెట్ చేసిన విషయం తెలిసిందే.
టీడీపీ అనుకూల మీడియాలో ఏకంగా ” ఎన్టీఆర్ పేరు మార్చుకో” అంటూ కథనం ప్రసారం చేశారు. మొన్నటి వరకు కార్యకర్తల వరకే ఎన్టీఆర్ పై దాడి చేశారు. తాజాగా నాయకులు సైతం బయటపడి ఎన్టీఆర్ ని దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే ఎన్టీఆర్ పై వచ్చే విమర్శలను అభిమానులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో కూడా పలు సందర్భాల్లో ఎన్టీఆర్ ఇదే తరహా దాడికి గురయ్యారు.
Those words 🥺🫰🖤 @tarak9999 pic.twitter.com/vlzUlqsLp2
— 🦚Sandhya_NTR🐉 (@Kuttima_kutty) September 16, 2023