Women’s World Cup 2025: సంవత్సరాల నిరీక్షణకు ఉమెన్స్ క్రికెట్ జట్టు తెర దించింది.. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో అద్భుతంగా పోరాడి ట్రోఫీని అందుకుంది. లీగ్ దశలో వరుసగా మూడు ఓటములు ఎదురైనప్పటికీ బౌన్స్ బ్యాక్ అన్నట్టుగా పుంజుకుంది. అన్ని విభాగాలలో అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి సంచలనం సృష్టించింది.. 2005, 2017లో ఫైనల్ లో ఓడిపోయిన టీమ్ ఇండియా.. 2025లో మాత్రం ఆ సీన్ రిపీట్ కానివ్వలేదు. పైగా దక్షిణాఫ్రికా జట్టుతో అద్భుతంగా పోరాడి చివరికి విజయాన్ని అందుకుంది.. వరల్డ్ కప్ ట్రోఫీని సగర్వంగా దక్కించుకుంది.
వరల్డ్ కప్ సాధించిన తర్వాత భారత మహిళల జట్టు పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇప్పటికే ఓ జువెలరీ సంస్థ భారత మహిళా క్రికెటర్లకు నెక్లెస్ లను బహుమతిగా ప్రకటించింది.. బిసిసిఐ 51 కోట్ల నజరానా ప్రకటించింది.. ఐసీసీ 39 కోట్లను ప్రైస్ మనీ గా అందించింది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన స్వగృహానికి మహిళా ప్లేయర్లను ఆహ్వానించారు. వారితో మాట్లాడారు.. ప్రేమ పూర్వక విందు కూడా ఇచ్చారు. వారితో కలుపుగోలుగా మాట్లాడారు. అనేక విషయాలను వారితో చర్చించారు.. ఇక ఆయా మహిళా ప్లేయర్లకు వారి వారి సొంత రాష్ట్ర ప్రభుత్వాలు నజరానాను ప్రకటించాయి.. క్రాంతి గౌడ్, రాధా యాదవ్ కు వారి సొంత రాష్ట్ర ప్రభుత్వాలు కోటి రూపాయల నజరానా ప్రకటించాయి. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇస్తున్నట్టు వెల్లడించాయి.
మహిళా ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో మనదేశంలో పేరుపొందిన వ్యాపార సంస్థ టాటా.. టీమిండియా ప్లేయర్లకు ఊహించని కానుక ఇవ్వనుంది. దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ టీమిండియా కు వరల్డ్ కప్ అందించిన ప్లేయర్లకు శుభవార్త చెప్పింది. టాటా కంపెనీ త్వరలోనే విడుదల చేయబోతున్న సియారా ఎస్ యూవీ మొదటి బ్యాచ్ లోని టాప్ ఎండ్ మోడల్ కార్లను ప్రతి ప్లేయర్ కు అందిస్తామని వెల్లడించింది. వరల్డ్ కప్ లో విజేతలు.. మార్కెట్లోకి ఇప్పుడు పునరాగమనం చేస్తున్న సియారా.. పట్టుదలకు, ధైర్యానికి ప్రతీకలని టాటా మోటార్స్ చెబుతోంది. మరోవైపు ఈ కారు ఈనెల 25న మార్కెట్లోకి రానుంది.
వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత మహిళల జట్టు విలువ అమాంతం పెరిగింది.. ప్లేయర్ల వ్యక్తిగత ప్రదర్శన కూడా బాగుండడంతో.. వారి ర్యాంకులు అమాంతం మెరుగుపడ్డాయి. వరల్డ్ కప్ సాధించిన నేపథ్యంలో టీమిండియా ఆట తీరు పూర్తిగా మారిపోతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది టీమిండియా క్రికెట్ గతిని పూర్తిగా మార్చేస్తుందని వారు ఆకాంక్షిస్తున్నారు.