Site icon OkTelugu

Tharun Bhascker: తరుణ్ భాస్కర్ డైరెక్షన్ చేయకపోవడానికి ఎన్టీఆర్ కారణమా..? అసలేం జరిగిందంటే..?

Tharun Bhascker

Tharun Bhascker

Tharun Bhascker: ‘పెళ్లిచూపులు’ సినిమాతో నేషనల్ అవార్డుని అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్…ఆయన సినిమాల్లో ఒక ఫ్లో అయితే ఉంటుంది. ప్రేక్షకులందరు మెచ్చే విధంగా తను సినిమాలు చేయడంలో దిట్ట ఆ సినిమా తర్వాత ఆయన చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఆయన చేసిన ‘కీడా కోలా’ సినిమా సైతం ప్రేక్షకుల్లో విశేషమైన స్పందనను రాబట్టింది. అలాంటి ఒక మంచి దర్శకుడు సినిమాల్లో యాక్టింగ్ చేస్తూ దర్శకత్వం వైపు అసలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కారణం ఏంటి అంటే కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ వల్లే తరుణ్ భాస్కర్ సినిమాలను డైరెక్షన్ చేయడం లేదంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ కి, తరుణ్ భాస్కర్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి ఆయనేం చేశాడు అంటూ మరి కొంతమంది కొన్ని డౌట్లు అడుగుతున్నారు. దీన్నిబట్టి చూస్తే తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏమైంది సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

ఒక అద్భుతమైన కథను కూడా తనకోసం రెడీ చేశారట. కానీ ఎన్టీఆర్ మాత్రం తనకున్న బిజీ షెడ్యూల్స్ వల్ల ఆ కథను చేయలేకపోయాడు. దాంతో ఆయన దర్శకత్వం వైపు కంటే కూడా నటన వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇంకా తొందరలోనే మరోసారి ఒక పెద్ద హీరోతో సినిమా చేయడానికి తను రంగం సిద్ధం చేసుకుంటున్నాడట.

నిజానికి తరుణ్ భాస్కర్ సినిమాల్లో సెన్సిబిలిటీస్ అయితే చాలా బాగుంటాయి. హీరో క్యారక్టరైజేషన్ గాని, హీరోయిన్ యొక్క హావభావాలు గాని ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. అందువల్ల తనతో సినిమాలు చేయడానికి చాలామంది హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్న కూడా ఆయన మాత్రం దర్శకత్వం మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించినట్టుగా కనిపించడం లేదు.

ఇక తొందరలోనే మరోసారి మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తే బాగుంటుందని అభిమానులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు…చూడాలి మరి ఆయన ఎప్పుడూ డైరెక్షన్ చేస్తాడు తన అభిమానుల ఆకలి ఎప్పుడు తీరుస్తాడు అనేది…

Exit mobile version