Posani Krishna Murali: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘టార్గెట్ టు పోసాని కృష్ణమురళి’ అనే నినాదం నడుస్తోంది. పోసాని పవన్ ను ఉద్దేశించి అనేక ఆరోపణలు చేయడం, మెయిన్ గా ఇన్ డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ పై అనేక నిందలు మోపడం..ఆ తర్వాత పవన్ ఫ్యాన్స్ పోసాని పై అటాక్ చేయడం.. ఇక పోసాని అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం.. ఇలా ఈ వ్యవహారం అంతా తెలిసిందే. అయితే, రోజులు గడిచాయి, ఆ వ్యవహారం సద్దుమణిగింది.

అయితే పోసాని అనే నటుడు పవన్ కళ్యాణ్ పై ఆ స్థాయిలో విరుచుకు పడతాడని ఎవరూ ఊహించలేదు, ముఖ్యంగా మెగా కాంపౌండ్ అసలు ఊహించలేదు. ఒక విధంగా పోసాని వ్యాఖ్యలు చిరంజీవిని కూడా చాలా బాధ పెట్టాయి. కారణం నటుడిగా పోసానికి లైఫ్ ఇచ్చింది మెగా ఫ్యామిలీనే. ఈ విషయం పోసాని కూడా గతంలో అనేకసార్లు చెప్పుకున్నారు కూడా. అలాంటి ఫ్యామిలీ పై, పైగా చిరు తల్లి పై పోసాని కామెంట్స్ చేయడం మెగా ఫాలోవర్స్ కి అలాగే మెగా అభిమానులకు అసలు నచ్చలేదు.
ఇండస్ట్రీలో సగం మంది మెగా ఫ్యామిలీకి అభిమానులు, సన్నిహితులు. అందుకే, ఇప్పుడు వారంతా పోసానికి ఛాన్స్ లు ఇవ్వకూడదు అని నిర్ణయించుకున్నారు. పనిలో పనిగా వేరే ఏ సినిమాలో అయినా పోసానికి అవకాశం ఇస్తుంటే.. ఫోన్ చేసి మరీ అతన్ని తీసేయండి అని గట్టిగానే డిమాండ్ చేస్తున్నారు. నిజానికి దర్శకుడు హరీష్ శంకర్ పోసాని కోసం ఓ ప్రత్యేక పాత్ర రాశారు. ఆ విషయం పోసానికి కూడా చెప్పారు.
అయితే, ఇప్పుడు హరీష్ పోసాని క్యారెక్టర్ ప్లేస్ లో మరో నటుడ్ని తీసుకుంటున్నాడు. ఒక్క హరీష్ శంకర్ మాత్రమే కాదు, చాలా మంది దర్శక నిర్మాతలు ఇప్పుడు పోసాన్ని దూరం పెడుతున్నారు. దాంతో బిజీ ఆర్టిస్ట్ కాస్త ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఒకే ఒక్క స్పీచ్ కారణంగా పోసాని సినీ కెరీర్ ఇలా అర్ధంతరంగా మునిగిపోవడం దారుణమే. కానీ పోసాని వ్యాఖ్యలు అంతకుమించిన దారుణం.
ఎవరికో సపోర్ట్ చేస్తూ..లైఫ్ ఇచ్చిన ఫ్యామిలీని తిట్టడం కచ్చితంగా తప్పే. నిజానికి మొదటినుంచీ మెగా ఫ్యామిలీ పోసానిని తమవాడిగా చూసింది. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో కూడా పోసానికి పిలిచి మరీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అలాగే ఒకప్పుడు పోసానికి సినీ రచయితగా లైఫ్ ఇచ్చింది కూడా చిరునే. అప్పట్లో కొంతమంది చిన్న నిర్మాతలకు పోసాన్ని చిరు రికమండ్ చేశారు. కానీ పోసాని ఏమి చేశాడు ? జీవితాన్ని ఇచ్చిన మెగాస్టార్ కుటుంబాన్నే అడ్డమైన తిట్లు తిట్టాడు. అందుకే, ఇప్పుడు ఛాన్స్ లను కోల్పోతున్నాడు.