Shyam Singaroy: టాలీవుడ్ యంగ్ హీరో నాని వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. నాని ప్రస్తుతం ” శ్యామ్ సింగరాయ్ ” అనే సినిమాలో నటిస్తున్నాడు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటివరకు ఎమోషనల్, కామెడీ సినిమాలు ఎక్కువగా చేసిన త్వరలోనే పూర్తిస్థాయి యాక్షన్ సినిమాతో రాబోతున్నాడు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా రేపు (డిసెంబర్24) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను వేగవంతం చేసింది సినిమా యూనిట్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను అలరిస్తుండగా తాజాగా మరొక అప్డేట్‌ను విడుదల చేసింది చిత్రబృందం.

Also Read: శ్యామ్ సింగరాయ్ అద్భుతం.. స్టార్ హీరో కోసం మరో కథ సిద్ధం !
ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలోని ‘తార’ అనే మరో మెలోడి పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు చిత్ర బృందం. ఈ పాటకు కృష్ణకాంత్ సాహిత్యం అందించగా యంగ్ సింగర్ కార్తీక్ ఆలపించాడు. మంచి మెలోడియస్‌గా సాగుతున్న ఈ పాట సంగీతాభి మానులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
ఇక మరోవైపు తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో ఏపీలో టికెట్ రేట్లు తగ్గించి ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించిందని, టికెట్ రేట్లు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని హీరో నాని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. థియేటర్ కంటే కిరాణా కొట్టు కలెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయని, థియేటర్ కంటే కిరాణా కొట్టు పెట్టుకోవడం బెటర్ అని ఆయన అన్నారు. ఇప్పుడు నాని చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
Also Read: నాని కెరీర్లో ఇదే అతిపెద్ద సినిమా అవుతుంది- రాహుల్