Tanikella Bharani: ఈమధ్య కాలం లో రీ రిలీజ్ ట్రెండ్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న చిత్రం ‘శివ'(Siva Movie). అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna),రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లోనే ఒక మైలు రాయి లాంటిది. సందీప్ వంగ సినిమాలను చూసి ఇప్పటి ఆడియన్స్ వెర్రిక్కిపోతున్నారు. కానీ సందీప్ వంగ టేకింగ్ కంటే వంద రెట్లు మెరుగ్గా ఉంటుంది ఈ టేకింగ్. ఆ రోజుల్లో అసలు ఇలాంటి సినిమా తీసే ఆలోచన వర్మ కి ఎలా వచ్చింది?, లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నాగార్జున ఎలా ఈ చిత్రానికి ఒప్పుకున్నాడు అనేది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్న. అయితే ఈ సినిమాకు స్క్రిప్ట్ రైటర్ గా ప్రముఖ నటుడు తనికెళ్ళ భరణి వ్యవహరించిన సంగతి మన అందరికీ తెలిసిందే.
ఆయన శివ సినిమా అనుభవాలను పంచుకుంటూ ‘వర్మ నాకు శివ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు, సంఘటనలు చెప్పి పూర్తి స్థాయి స్క్రిప్ట్ రాయమని చెప్పాడు. ఆ సమయం లో రామ్ గోపాల్ వర్మ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా కృష్ణ వంశీ వ్యవహరిస్తున్నాడు. నేను రాసిన స్క్రిప్ట్ ని చదివి ఆయన పగలబడి నవ్వుకున్నాడు. ఆ తర్వాత ఇదే స్క్రిప్ట్ ని రామ్ గోపాల్ వర్మ కి వినిపిస్తే, ఇదేంటి స్క్రిప్ట్ లో ఇన్ని జోకులు రాసావు అని అడిగాడు. కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమా కదా, అందుకు ఇవి కచ్చితంగా ఉండాలి అని అన్నాను. అప్పుడు వర్మ సినిమాలో ఒక్కటంటే ఒక్క జోకు కూడా ఉండడానికి వీలు లేదు అన్నాడు. అప్పుడు నాకు మనసులో కలిగిన భావన, ఆహా ఇక ఈ సినిమా ఆడినట్టేలే అని అనుకున్నాను. నాకే కాదు, యూనిట్ మొత్తానికి వర్మ ఆ మాట అనేసరికి ఈ సినిమా ఆడుతుంది అనే నమ్మకం కలగలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘వర్మ చెప్పిన మార్పులు చేయడం నా వల్ల కాలేదు. ఎదో ప్రయత్నం చేశా కానీ అది నచ్చుతుందని అనుకోలేదు. అసంతృప్తి తోనే నేను నేరుగా స్క్రిప్ట్ ని వర్మ కి ఇవ్వలేక, నా మిత్రుడు CVL నరసింహారావు చేతికి ఇచ్చి అన్నపూర్ణ స్టూడియోస్ లో ఇవ్వమని చెప్పాను. ఆ తర్వాత వర్మ నుండి నాకు ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు. స్క్రిప్ట్ అతనికి నచ్చిందని అనుకున్నాను కానీ ఈలోపు సినిమా ప్రకటన వచ్చేసింది. అందులో నా పేరు లేదు. నేను వెంటనే కో డైరెక్టర్ నాగేశ్వర రావు కి ఫోన్ చేసాను. సినిమా ప్రారంభోత్సవానికి ఎందుకు రాలేదు అని అడిగారు. అప్పుడు నేను జరిగిందంతా చెప్పాను, వర్మ గారు ఎందుకో నీ మీద అలిగారు అని అన్నాడు. ఆ తర్వాత నేనే స్వయంగా వర్మ కి ఫోన్ చేశా. అప్పుడు ఆయన మాట్లాడుతూ భరణి ఏంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావ్, శివ కాస్ట్యూమ్స్ కోసం చెన్నై కి వచ్చాను. మీ ఇంటికి వస్తాను అని అన్నాడు. సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చాడు. భరణి ఈ సినిమా నుండి నిన్ను తీసి వేయడానికి కారణం ఏంటో తెలుసా?, ఒక సినిమాకు స్క్రిప్ట్ దేవుడు లాంటిది. దాన్ని నువ్వు వేరే వాళ్ళతో ఇచ్చి పంపించావు, అది చాలా పెద్ద తప్పు అని అన్నాడు. అసలు ఇందులో కథ ఏముంది అని అన్నాను. అలా మా మధ్య కాస్త సరదా సంభాషణ జరిగింది. ఇక ఆ తర్వాత ఎలాంటి చరిత్ర సృష్టించిందో మీరంతా చూసారు’ అంటూ చెప్పుకొచ్చాడు తనికెళ్ళ భరణి.