Site icon OkTelugu

Tammineni Family: ఒడిస్సాలో చిక్కిన తమ్మినేని ఫ్యామిలీ?!

Tammineni Family

Tammineni Family

Tammineni Family: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబంతో సహా పరారీలో ఉన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో నాలుగు కోట్ల భూమిని అక్రమంగా కొల్లగొట్టారు అని తమ్మినేని ఫ్యామిలీ పై ఉన్న అపవాదు. ఓ భూమికి సంబంధించి యజమాని బతికి ఉండగా.. ఆయన వారసుల పేరుతో నకిలీ ధ్రుపత్రాలు సృష్టించి.. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనేది తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ పై ఉన్న అభియోగం. ఈ విషయంలో స్పీకర్ గా ఉన్న తమ్మినేని, ఆయన భార్య వాణి సహకరించారు. ఒడిస్సాలో మనుషులు తెప్పించి, సబ్ రిజిస్టార్ సాయంతో ఈ అక్రమ పర్వానికి తెర లేపారు అనేది పోలీసుల విచారణలో తేలింది. అందుకే వారిపై కేసు నమోదయింది. మిగతా నిందితులు అరెస్ట్ కాగా.. తమ్మినేని ఫ్యామిలీ మాత్రం పరారీలో ఉంది.

* ముందస్తు బెయిల్ కోసం..
అయితే న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తమ్మినేని సీతారాం భావించారు. అందుకే ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు క్వాష్ పిటిషన్ సైతం దాఖలు చేశారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ కోర్టు అందుకు అంగీకరించలేదు. దీంతో తమ్మినేని కి షాక్ తగిలినట్లు అయింది. అరెస్టు తప్పదు అని తేలిపోయింది. ఈ క్రమంలో ఇంటికి తాళాలు వేసి తమ్మినేని పరారయ్యారు. సొంత వాహనాలు, సెల్ఫోన్లను ఇంటి వద్ద విడిచిపెట్టి కుటుంబ సభ్యులకు సహపరారయ్యారు. వారి కోసం పోలీసు బృందాలు విస్తృతంగా సోదాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో తమ్మినేని ఒడిస్సాలో పట్టుబడినట్లు తెలుస్తోంది.

* అ మాజీ మంత్రి అరెస్టుతో..
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టు జరిగింది. కొద్దిరోజుల కిందట ఆయన కుమారుడు బైక్ పై అతివేగంగా వెళుతూ ఒకరిని ఢీ కొట్టి మరణానికి కారణమయ్యారు. అయితే ఆ కేసును తారుమారు చేసే ప్రయత్నం చేశారు. కుమారుడి స్థానంలో వేరొక వ్యక్తిని కేసులో ఇరికించారు. కానీ పోలీస్ విచారణలో అసలు విషయం బయటపడింది. దీనితో అప్పలరాజు అరెస్టు జరిగింది. అయితే తమ్మినేని సీతారాం విషయంలో కూడా పోలీసులు సీరియస్ గా దృష్టి పెట్టారు. ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. అయితే సొంత వాహనాలను ఇంటి వద్ద విడిచిపెట్టారు. ఫోన్లను సైతం ఇంటి వద్ద ఉంచేశారు. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ జరిపేసరికి అసలు విషయం బయటపడింది. ఒడిస్సాలో తమ్మినేని సీతారాం తో పాటు ఆయన కుటుంబ సభ్యుల ఆచూకీ దొరికినట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయంలో పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదు. అందుకే క్లారిటీ రావడం లేదు.

Exit mobile version