Allu Arjun: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో వాళ్ళ సత్తాను చాటుతూ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోలుగా కొనసాగుతున్నారు. ఇక ఇప్పటికే స్టార్ హీరోలు అయిన ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు తమదైన రీతిలో పాన్ ఇండియా లెవెల్లో భారీ సక్సెస్ లను అందుకోవడమే కాకుండా వాళ్ల సినిమాల ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంటున్నారు.
ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు దాన్ని డామినేట్ చేసి తెలుగు సినిమానే ఇండియన్ సినిమాగా చెప్పుకునే రేంజ్ లోకి తెలుగు సినిమాని తీసుకెళ్లారు. నిజానికి ఈ విషయంలో రాజమౌళిని మనం మెచ్చుకోవాలి ఎప్పుడైతే బాహుబలి సినిమా తీశాడో అప్పటినుంచి పాన్ ఇండియా సినిమాలు రావడం అనేది మొదలయ్యాయి. ఇక దాన్ని అనుసరిస్తూ మిగతా డైరెక్టర్లు హీరోలు సక్సెస్ లు కొడుతూ ఉండడంతో పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమా మార్కెట్ అనేది భారీగా పెరిగింది.
నిజానికి పాన్ ఇండియా అంటే గుర్తొచ్చేది తెలుగు సినిమానే తెలుగులో ఉన్న స్టార్ హీరోలు అందరూ వరసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. అలాగే డైరెక్టర్లు కూడా మంచి కథలను ఎంచుకొని వాళ్ళకి ఇష్టమైన కథలతో సినిమాలు చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో తమిళ ఇండస్ట్రీకి చెందిన కార్తీక్ సుబ్బరాజు కూడా తెలుగు హీరోల మీద ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ చెంజర్ సినిమాకి కార్తిక్ సుబ్బరాజు తన కథను అందించాడు. ఇక అదే రీతిలో అల్లు అర్జున్ కి కార్తీక్ సుబ్బరాజు ఒక అదిరిపోయే కథ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆయన కథల్లో వేరియేషన్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. నిజానికి ఒక కథని డెప్త్ గా చెప్పడంలో కార్తీక్ సుబ్బరాజును మించిన డైరెక్టర్ లేడనే చెప్పాలి. ఆయన రాసుకున్న కథని డెప్త్ లెవెల్ కి వెళ్లి ఆ కోర్ ఎమోషన్ ని పట్టుకొని బయటికి లాక్కొని తీసుకురావడంలో కార్తీక్ సుబ్బరాజు సిద్ధహస్తుడు.
అయితే మన తెలుగు హీరోలు కూడా ఆయనతో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఆయన అల్లు అర్జున్ కి ఒక కథ వినిపించినట్టుగా తెలుస్తుంది. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమా పట్టాలెక్కాలి అంటే ఇంకా ఎన్ని రోజులు పడుతుందో తెలియాల్సి ఉంది…