https://oktelugu.com/

NTR and Ram Charan : ఎన్టీయార్, రామ్ చరణ్ లు డేట్స్ ఇచ్చిన కూడా వాళ్ళను పట్టించుకోని తమిళ్ స్టార్ డైరెక్టర్…

సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకొని పెట్టుకున్నారు.

Written By:
  • Gopi
  • , Updated On : December 25, 2024 / 09:25 AM IST

    NTR , Ram Charan

    Follow us on

    NTR and Ram Charan : సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకొని పెట్టుకున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా కూడా భారీ విజయాలను దక్కించుకోవడమే కాకుండా స్పెషల్ ఐడెంటిటిని సంపాదించి పెడుతున్నాయి. ఇక స్టార్ డైరెక్టర్ అయిన వెట్రీ మారన్ సైతం ప్రస్తుతం తమదైన రీతిలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…

    తమిళ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు వెట్రీ మారన్ ప్రస్తుతం ఆయన తమిళ సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపైతే ఉంది. ఇక యావత్ ఇండియాలో ఉన్న హీరోలందరూ అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు అంటే ఆయన ఎలాంటి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడో దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన ధనుష్ తో కలిసి చేసిన సినిమాలన్నీ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇంకా దానికి అనుగుణంగానే ఆయన చేసిన ‘అసురన్ ‘ సినిమాకి నేషనల్ అవార్డు రావడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు. ఇక ‘వడ చెన్నై’ సినిమాకి కూడా నేషనల్ అవార్డు వరించింది. ఇలాంటి ఒక గొప్ప సినిమాలను తీస్తూ ముందుకు సాగుతున్న వెట్రిమారన్ గత సంవత్సరం ‘విడుదల ‘ అనే సినిమాను చేశాడు.

    ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. తెలుగు తమిళంలో దానికి మంచి గుర్తింపైతే వచ్చింది. కానీ ఇప్పుడు ‘విడుదల 2’ సినిమా చేశాడు. తెలుగులో ఈ సినిమాకి పెద్దగా ఆదరణ అయితే దక్కడం లేదు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించినప్పటికి తెలుగులో మాత్రం పెద్దగా ప్రేక్షకులు ఈ సినిమాను పట్టించుకోకపోవడం విశేషం…

    విజయ్ సేతుపతి లాంటి నటుడు సైతం ఈ సినిమాలో ఉన్నప్పటికి ఈ సినిమా మీద ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దానికి తగ్గట్టుగానే ఈ సినిమా కూడా అంత పెద్దగా ప్రేక్షకులను ఎంగేజ్ చేసే విధంగా అయితే లేకపోవడం ఈ సినిమాకి మైనస్ గా మారింది. మరి ఏది ఏమైనా కూడా స్టార్ హీరోలతో సినిమాలను చేసుకుంటూ తన స్టార్ డమ్ ను పెంచుకోవాల్సిన మెట్రిమారన్ కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను తీయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటాడు. ఇక అతనికి హీరోలతో పనిలేదు కథని నమ్ముకొని ముందుకెళ్తే ఉంటాడు. కాబట్టి ఆయన సినిమాలో కమెడియన్స్ ని హీరోగా పెట్టి అయిన సినిమాలు చేసుకునే కెపాసిటీ ఉన్న దర్శకుడయన.

    ఇక ఇలాంటి సందర్భంలోనే వాళ్లతో సినిమాలను చేయగలడా లేదా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు అతనితో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సందర్భంలో ఆయన మాత్రం పట్టించుకోవడం లేదనే చెప్పాలి. ఎందుకు ఆయన ఇలా చేస్తున్నాడు ఒక మంచి కథతో వాళ్ళిద్దరికి సినిమాలు చేసి పెట్టొచ్చు కదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి…