Director Atlee Ad Film: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ల సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలాగే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ని ఛార్జ్ చేస్తూ స్టార్ హీరోలు సైతం ప్రేక్షకులకు ఎలాంటి సినిమాలు కావాలో అలాంటి మూవీస్ ను వాళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు…ఇక సినిమా కోసం భారీ బడ్జెట్ ని కేటాయించడంలో తప్పులేదు. కానీ మన మేకర్స్ యొక్క క్రియేటివిటీ లెవెల్స్ ఎక్కడికి పెరిగిపోయాయి అంటే ఒక చిన్న యాడ్ ఫిలిం చేయడానికి కూడా భారీ మొత్తంలో బడ్జెట్ ను కేటాయిస్తూ గొప్ప విజువల్స్ తో ఒక ఆడ్ ని షూట్ చేయడం అనేది మామూలు విషయం కాదు…
తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గా గుర్తింపు సంపాదించుకున్న అట్లీ సైతం ప్రస్తుతం అల్లు అర్జున్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక మూవీ తో పాటుగా ఆయన రీసెంట్ గా ఒక యాడ్ ఫిలిం చేశాడు. ఈ యాడ్ 150 కోట్లతో తెరకెక్కడంతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఒక్క యాడ్ ఫిలిం కి అన్ని కోట్లు కేటాయించడం అవసరమా అంటూ ప్రేక్షకుల నుంచి విమర్శలైతే తలెత్తుతున్నాయి…
ఇక ఎనిమిది నిమిషాల పాటు చిత్రీకరించిన ఆ యాడ్ ఫిలింలో టాప్ యాక్టర్ అయిన బాబీ డియోల్, బాలివుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకుంటున్న శ్రీలీలా లాంటి నటి నటులు నటించారు. ‘ఏజెంట్ చింగ్ అటాక్స్’ పేరుతో ‘శింగజవన్ చట్నీ’ ఆడ్ ఫిల్మ్ చేశారు. దాని కోసం భారీ సెట్ వేసి మరి చిత్రీకరించడం విశేషం…
ఇక ఇందులో రణ్వీర్ సింగ్ ఏజెంట్ చింగ్ గా కనిపించగా, శ్రీలీల ఏజెంట్ మిర్చి గా కనిపించి అలరించింది. ఈ యాడ్ ఫిలిం చూసిన ప్రతి ఒక్కరు కేవలం చట్నీ యాడ్ కోసం 150 కోట్లు కేటాయించడం అవసరమా? అదే డబ్బులు పెడితే ఒక మంచి సినిమా చేయచ్చు అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలనైతే వ్యక్తం చేస్తున్నారు… అట్లీ తన మేకింగ్ చూపించుకోవడానికి ఇంత భారీ బడ్జెట్ తో భారీ యాడ్ ఫిలిం చేశారంటు మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు… మొత్తానికైతే ఈ యాడ్ ఫిలిం మీద భారీ వ్యతిరేకత రావడం విశేషం…