https://oktelugu.com/

విజయ్ దేవరకొండకు లిప్ కిస్ ఇస్తానంటున్న తమన్నా

స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. మొదటిసారి బిగ్ బాస్ వేదికపై హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత, మామ నాగ్ బాధ్యతను బాగానే నిర్వర్తించింది. తెలుగు ఓటిటి యాప్ ఆహాలో సమంత ఓ టాక్ షో నిర్వహిస్తున్నారు. సామ్ జామ్ పేరుతో స్ట్రీమ్ అవుతున్న ఈ టాక్ షోలో ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, చిరంజీవి వంటి స్టార్స్ పాల్గొన్నారు. Also Read: రామ్ చరణ్ కొత్త సినిమా ఓపెనింగ్ డేట్ […]

Written By:
  • admin
  • , Updated On : December 10, 2020 / 02:02 PM IST
    Follow us on


    స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్ అవతారం ఎత్తిన సంగతి తెలిసిందే. మొదటిసారి బిగ్ బాస్ వేదికపై హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన సమంత, మామ నాగ్ బాధ్యతను బాగానే నిర్వర్తించింది. తెలుగు ఓటిటి యాప్ ఆహాలో సమంత ఓ టాక్ షో నిర్వహిస్తున్నారు. సామ్ జామ్ పేరుతో స్ట్రీమ్ అవుతున్న ఈ టాక్ షోలో ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, చిరంజీవి వంటి స్టార్స్ పాల్గొన్నారు.

    Also Read: రామ్ చరణ్ కొత్త సినిమా ఓపెనింగ్ డేట్ ఫిక్స్ !

    తాజాగా ఈ షోకి గెస్ట్ గా మిల్కీ బ్యూటీ తమన్నా వచ్చారు. సరదా సంభాషణలతో సాగిన ఈ షోలో సమంత అడిగిన బోల్డ్ క్వశ్చన్స్ కి తమన్నా క్రేజీ ఆన్సర్స్ చెప్పారు. సిల్వర్ స్క్రీన్ పై లిప్ కిస్ సీన్ చేయాలంటే ఎవరితో చేశారని అడుగగా, విజయ్ దేవరకొండతో చేస్తానని టక్కున చెప్పేశారు.విజయ్ దేవరకొండ సరసన మూవీ చేయాలని ఉందన్న కోరికను తమన్నా ఆ విధంగా బయటపెట్టారు. ఇక మీరు కవితలు కూడా రాస్తారా అని సమంత అడగడం జరిగింది. మన హార్ట్ బ్రేక్ అయితే ఆటోమేటిక్ గా కవిగా మారిపోతాం అని సమంత చెప్పారు.

    Also Read: నిహారిక పెళ్లికి మెగా కానుకల విలువ 5 కోట్లు !

    ఇక గోపి చంద్ హీరోగా తెరకెక్కుతున్న సీటీమార్ మూవీలో తమన్నా లేడీ కబడ్డీ కోచ్ రోల్ చేస్తున్నారు. అలాగే నితిన్ హీరోగా తెరకెక్కుతున్న అందాధున్ తెలుగు రిమేక్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న బోల్డ్ రోల్ చేస్తున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్