Tabu Rejects Nagarjuna Offer: అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna),టబు(Tabu) కాంబినేషన్ ఎవర్ గ్రీన్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళ కాంబినేషన్ లో అప్పట్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అందులో ‘నిన్నే పెళ్లాడతా’ చిత్రం ఒక సంచలనం. కమర్షియల్ గా ఇండస్ట్రీ హిట్ అవ్వడమే కాకుండా, టాలీవుడ్ ఆల్ టైం క్లాసిక్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిల్చింది. ఆ సినిమాతో ఏర్పడిన వీళ్లిద్దరి పరిచయం ప్రేమ వరకు వెళ్ళింది. అమల తో అప్పటికే పెళ్లి అయినప్పటికీ, టబు తో నాగార్జున ప్రేమాయణం నడిపాడని, ఈ విషయం అప్పట్లో అమలకి కూడా తెలుసనీ, పెద్ద ఎత్తున ఇండస్ట్రీ లో చర్చ జరిగింది. ఇవంతా కేవలం రూమర్స్ మాత్రమే, మేమిద్దరం మంచి స్నేహితులం, మా మధ్య అంతకు మించిన రిలేషన్ ఏమి లేదని నాగార్జున చెప్పలేకపోయాడు. అటు పక్క టబు కూడా ఈ రిలేషన్ పై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.
ఇప్పటికీ టబు తో నాగార్జున మంచి సన్నిహిత్యమే మైంటైన్ చేస్తూ వస్తున్నాడు. నాగార్జున పిల్లలతో కూడా టబు బాగా మాట్లాడుతుంది. అక్కినేని అఖిల్ పెళ్లికి కూడా వచ్చింది. నాగార్జున తో ఇంతటి క్లోజ్ రిలేషన్ ని మైంటైన్ చేస్తున్న టబు, రీసెంట్ గా నాగార్జున ఇచ్చిన ఒక ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట. ఈ విషయం సోషల్ మీడియా లో లీకై సంచలనం గా మారింది. వివరాల్లోకి వెళ్తే, నాగార్జున తన వందవ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబంధించిన పూజ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టాడు. తమిళ దర్శకుడు కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ చిత్రం లో ఒక కీలక పాత్ర కోసం టబు ని సంప్రదించారట మేకర్స్. మంచి రెమ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. కానీ టబు మాత్రం ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు సమాచారం.
ఇప్పుడు ఆమె స్థానం లోకి నయనతార ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఈమేరకు ఆమెని సంప్రదించడం, అందుకు ఆమె వైపు నుండి గ్రీన్ సిగ్నల్స్ రావడం జరిగిందట. కానీ రెమ్యూనరేషన్ మాత్రం పది కోట్ల రూపాయలకు పైగా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. మేకర్స్ అందుకు కూడా ఒప్పుకున్నారట. గతం లో నయనతార నాగార్జున తో కలిసి బాస్, గ్రీకు వీరుడు వంటి చిత్రాలు చేసింది. ఈ రెండు సినిమాలు ఒక దానిని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. ఇప్పుడు వీళ్లిద్దరు ముచ్చటగా మూడవసారి కలిసి నటిస్తున్నారు. కనీసం ఈసారైనా హిట్ కొడుతారో లేదో చూడాలి. ఇదంతా పక్కన పెడితే నాగార్జున సినిమాని టబు రిజెక్ట్ చేయడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసి విషయం. డేట్స్ ఇవ్వలేనంత బిజీ గా కూడా ఆమె లేదు, అయినప్పటికీ ఈ సినిమాని రిజెక్ట్ చేసిందంటే, నిర్మాతలు ఇస్తామని చెప్పిన రెమ్యూనరేషన్ ఆఫర్ ఆమెకు నచ్చలేదా?, ఇంకా ఎక్కువ డిమాండ్ చేసిందా? వంటి సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.