భర్త ఏం చేయలేదు: శృంగార తార కన్నీళ్లు

శృంగార తార స్వాతి నాయుడు జీవితం దుర్భరంగా మారిపోయింది. తన అందచందాలతో కనువిందు చేసిన ఈ అమ్మడు వివాహం తరువాత కష్టాలు కొనితెచ్చుకుంటోంది. భర్త వల్ల ఏ సుఖానికి నోచుకోకపోగా నష్టాలే ఎక్కువగా భరిస్తోంది. పెళ్లి తరువాత అందరి తలరాతలు మారితే ఈవిడ విధి రాత కూడా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి నాయుడు తన దుస్థితికి మదన పడుతున్నారు. తన భర్తలో ఎలాంటి ఫీలింగ్స్ లేవని తెలిపింది. ఒక వస్తువు మాదిరి ఉన్నాడని వాపోయింది. […]

Written By: Raghava Rao Gara, Updated On : July 31, 2021 7:34 pm
Follow us on

శృంగార తార స్వాతి నాయుడు జీవితం దుర్భరంగా మారిపోయింది. తన అందచందాలతో కనువిందు చేసిన ఈ అమ్మడు వివాహం తరువాత కష్టాలు కొనితెచ్చుకుంటోంది. భర్త వల్ల ఏ సుఖానికి నోచుకోకపోగా నష్టాలే ఎక్కువగా భరిస్తోంది. పెళ్లి తరువాత అందరి తలరాతలు మారితే ఈవిడ విధి రాత కూడా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న స్వాతి నాయుడు తన దుస్థితికి మదన పడుతున్నారు.

తన భర్తలో ఎలాంటి ఫీలింగ్స్ లేవని తెలిపింది. ఒక వస్తువు మాదిరి ఉన్నాడని వాపోయింది. తన పాప బాగోగులు సైతం పట్టించుకునే వాడు కాదని పేర్కొంది. జీవితంలో కష్టాలు, క్లిష్ట పరిస్థితులు అందరికి వస్తాయని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని యూజర్లు స్పందిస్తున్నారు. జీవితాన్ని ఎదుర్కొని సమస్యలపై పోరాడాలని, రాజీ పడి ఆవేదనకు గురికావద్దని ధైర్యం చెబుతున్నారు.

వివాహం తరువాత జీవితం ఆనందంగా ఉంటుందని ఆశించినా అవేవీ కనిపించడం లేదు. తన తండ్రి ఆర్థికంగా మోసం చేశాడని వాపోయింది. తను జీవితంలో కష్టపడి సంపాదించిన దాన్ని తన తండ్రి మోసం చేసి తనకు డబ్బు ఇవ్వలేదని నిట్టూర్చింది. ఇంటిం నుంచి వెళ్లగొట్టాడని వాపోయింది. భర్త కూడా నిత్యం తాగి వచ్చి రభస చేయడంతో అతడికి దూరంగా ఉంటున్నట్లు చెప్పింది.

స్వాతినాయుడు జీవితం కూడా సినిమాలాగే మారిపోయింది. ఎంతో ఆశలతో సంసార జీవితంలోకి అడుగుపెట్టిన ఆమెకు నిరాశే ఎదురైంది. భర్త వేధింపులతో నిత్యం నరకమే చవిచూస్తూ జీవితం మీద ఆశలు వదులుకుంది. తనకు భర్త లేడని, మోసపోయానని బాధ వ్యక్తం చేసింది. భవిష్యత్ పై ఆశలు కూడా చచ్చిపోయాయని వాపోయింది.