https://www.instagram.com/p/CFczs92AOEe/
సురేఖా వాణి.. ఏజ్ అయిపోయినా ఇంకా పర్ఫెక్ట్ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ.. కొత్త కొత్త లుక్స్ తో కుర్రకారుని ఉక్కిరిబిక్కిరి చేయటానికి తెగ తాపత్రయ పడుతున్నట్లు కనిపిస్తోంది. అనవసరమైన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. తన ఫాలోవర్స్ కు మంచి కిక్ ఇస్తోంది. సినిమాల్లో అక్క అమ్మ పాత్రలతో పాటు కొన్ని ఎమోషనల్ పాత్రల్లోనూ అంతే స్థాయిలో నటించి ఆ పాత్రలను రక్తి కట్టిస్తుంటుంది సురేఖా. అయితే తెర పై చూసే సురేఖా వాణి వేరు, బయట ఉంటే సురేఖా వాణి వేరు అన్నట్టు సాగుతొంది ప్రస్తుతం ఆమె సోషల్ మీడియా జర్నీ. ఎదిగిన కూతురు ఉన్నా… ఇంకా యంగ్ అండ్ మోడ్రన్ మదర్ లానే నెటిజన్లతో రచ్చ రచ్చ చేస్తుంది. ఆమె దెబ్బకు కూతురు సుప్రిత కూడా పోటీ పడలేని పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: నమ్రతను నేను గౌరవిస్తా..: బండ్ల గణేశ్ కామెంట్స్
ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి అన్నట్టు .. తనెత్తు కూతురు ఉన్నా.. సురేఖా వాణి గ్లామర్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని నెటిజన్లు కూడా ఒకే మాటగా పోస్ట్స్ పెడుతున్నారు. ఆ మధ్య టిక్ టాక్‌లో ఈ తల్లీ కూతుళ్లు చేసిన రచ్చ గురించి ఇప్పట్లో ఎవ్వరూ మర్చిపోరు. ముఖ్యంగా ఇద్దరూ కలిసి చేసిన వీడియోలు, డ్యాన్సులు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అయ్యాయనేది వాస్తవం. వాటిల్లో పంచెలు కట్టుకుని కళ్లజోడు పెట్టుకుని చేసిన వీడియో అయితే ఇంకా షేర్ అవుతూనే ఉంది. మొత్తానికి పేరుకు తల్లీ కూతుళ్ళు అయినా ఫ్రెండ్స్ లా ఉంటూ.. ఇద్దరం కలిసి వెకెషన్లకు కూడా వెళ్తూ మోడ్రన్ తల్లీ కూతుళ్లులా కొత్త ట్రెండ్ ను సృష్టిస్తున్నారు వీరు.
Also Read: నా బయోపిక్ కు నేనే డైరెక్టర్ ను
కాగా ప్రస్తుతం సురేఖా వాణి రీసెంట్ గా మొదలైన షూటింగ్ లతో కాస్త బిజీ అయింది. ఈ క్రమంలోనే సురేఖా వాణి షూటింగ్ కోసం జైపూర్ వెళ్లింది. అక్కడ ఓ సినిమా షూటింగ్ లో గత వారం నుండి ఆమె పాల్గొంటుంది. అయితే నిన్న రాత్రి సురేఖా వాణి షూట్ నుండి వచ్చాక అదే గెటప్ లో ఉండి ఓ ఫోటోను షేర్ చేసింది. చీరకట్టులో సన్నజాజిలా మెరిసిపోతూ.. హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేలా ఉంది సురేఖా వాణి. ఈ ఫోటోలో సురేఖా వాణిని చూసి నెటిజన్లు కూడా షాక్ అవుతున్నారు. ఈ లాక్ డౌన్ లో మొత్తానికి సురేఖా వాణి మరింత గ్లామర్ తో రెడీ అయినట్లు కనిపిస్తోందట.