Surekha Vani: చాలా కాలం తర్వాత ముఖానికి రంగేసుకుంది సురేఖా వాణి. లేటెస్ట్ రిలీజ్ స్వాతి ముత్యం సినిమాలో సురేఖా వాణి ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. అసలు సురేఖా వాణి సినిమాలు ఎందుకు చేయడం లేదు? గ్యాప్ ఎందుకు వచ్చింది? అనే సందేహాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రశ్నలకు సురేఖా వాణి సమాధానాలు చెప్పారు. అదే సమయంలో ఇండస్ట్రీ తనను పక్కన పెట్టినట్లు ఒకింత బాధ వ్యక్తం చేశారు. స్వాతి ముత్యం మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్న సురేఖా వాణి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చాలా కాలం తర్వాత మీ ముందు ఇలా మాట్లాడే అవకాశం వచ్చింది. దానికి కారణమైన స్వాతిముత్యం డైరెక్టర్, నిర్మాతలకు ధన్యవాదాలు. అనేక మంది మీరు సినిమాలు ఎందుకు చేయడం లేదని అడుగుతున్నారు. మీరు చేసే ఆ తరహా పాత్రలు చాలా బాగుంటాయి. ఎందుకు పరిశ్రమకు దూరమయ్యారని చాలా మంది అడుగుతున్నారు. ఎందుకు చేయడం లేదంటే మా వరకు పాత్రలు రావడం లేదు. స్వాతిముత్యం డైరెక్టర్ నా క్యారెక్టర్ చెప్పడానికి వచ్చినప్పుడు కూడా… ముందుగా ఈ పాత్రకు నన్ను అనుకున్నారా? లేదంటే వేరేవాళ్ళను అనుకొని, తర్వాత నా దగ్గరికి వచ్చారా? అని అడిగాను.
మాకు అవకాశాలు ఇవ్వడం లేదు. ఇస్తే తప్పకుండా చేస్తాను. సురేఖా వాణి సినిమాలు మానేసిందని అనుకుంటున్నారు. నేను సినిమా అమ్మాయిని సినిమాలు మానేయడం జరగదు. ఎట్టిపరిస్థితుల్లో సినిమాలు చేస్తూనే ఉంటాను… అని ఆమె వెల్లడించారు. పరోక్షంగా పరిశ్రమ పట్టించుకోవడం లేదని, తొక్కేస్తున్నారని సురేఖా వాణి తనలో గూడు కట్టుకున్న అసహనాన్ని బయటపెట్టారు. శ్రీను వైట్ల సినిమాల్లో సురేఖా ఎక్కువగా కనిపించేవారు.

ఆయన తెరకెక్కించిన రెడీ, నమో వెంకటేశా, బాద్ షా, ఢీ చిత్రాల్లో ఆమె అలరించే పాత్రలు చేశారు. 2019లో సురేఖా వాణి భర్త అనారోగ్యంతో మరణించగా కొంచెం గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్ అలా కంటిన్యూ అయ్యింది. సోషల్ మీడియాలో సురేఖా వాణి చాలా యాక్టీవ్ గా ఉంటారు. కూతురుతో కలిసి హాట్ డాన్స్ వీడియోలు చేస్తారు. ఆమె రెండో పెళ్లికి సిద్దమయ్యారంటూ పుకార్లు వినిపించాయి. ఇకనైనా ఆమె విరివిగా సినిమాలు చేస్తారేమో చూడాలి.
Also Read:RRR Oscar: ఆస్కార్ బరిలో ఆర్ ఆర్ ఆర్… 15 విభాగాల్లో పోటీకి సిద్ధం!