Sankranti Aaynaam : విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన మూడవ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇటీవలే సంక్రాంతి కానుకగా విడుదలై మొదటి ఆట నుండే సెన్సేషనల్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ కెరీర్ లో గత రెండు దశాబ్దాల నుండి ఇలాంటి బ్లాక్ బస్టర్ హిట్ లేదని, మధ్యలో చేసిన మల్టీస్టార్రర్స్ హిట్ అయ్యాయి కానీ, ఆయన సోలో హీరో గా ఇలాంటి బ్లాక్ బస్టర్ ని చూసి 20 ఏళ్ళు దాటిందని అంటున్నారు ఆయన అభిమానులు. లేట్ గా కొట్టినా ఇండస్ట్రీ రికార్డ్స్ షేక్ అయ్యేలా కొట్టాడని, మెగాస్టార్ చిరంజీవి తర్వాత సీనియర్ హీరోలలో వంద కోట్ల రూపాయిల షేర్ క్లబ్ లోకి చేరబోతున్న రెండవ హీరో గా వెంకటేష్ సరికొత్త చరిత్ర సృష్టించాడని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గానే ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి చూశాడు.
చూసిన తర్వాత ఆయన ట్విట్టర్ లో స్పందిస్తూ ‘సంక్రాంతికి వస్తున్నాం చిత్రం పర్ఫెక్ట్ గా పండుగకి తగ్గట్టుగా ఉంది. చాలా ఎంజాయ్ చేశాను. వెంకటేష్ సార్ తన రాకింగ్ పెర్ఫార్మన్స్ తో అదరగొట్టేసాడు. నా డైరెక్టర్ అనిల్ రావిపూడి ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. వరుసగా హిట్టు మీద హిట్టు కొట్టుకుంటూ వెళ్తున్నాడు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి చాలా బాగా నటించారు. ఆ కుర్రాడు బుల్లి రాజు క్యారక్టర్ కి నాతో పాటు, మా ఇంట్లోని కుటుంబ సభ్యులు కూడా ఒక రేంజ్ లో నవ్వుకున్నాం. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యినందుకు అందరికీ నా కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను’ అంటూ ట్వీట్ వేశాడు. దీనికి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మూవీ లవర్ అయినటువంటి మహేష్ బాబు ప్రతీ సినిమాని చూసి దానికి సంబంధించిన రివ్యూ ని ట్విట్టర్ లో చెప్తూ ఉంటాడు.
అయితే ఈమధ్య కాలం లో మహేష్ బాబు ఏ సినిమాపై కూడా స్పంధించలేదు. చాలా కాలం తర్వాత ఆయన రెస్పాన్స్ ఇచ్చిన చిత్రమిదే. ఇదంతా పక్కన పెడితే త్వరలోనే దిల్ రాజు ఈ సినిమా సక్సెస్ కి సంబంధించి ఒక చిన్న ఈవెంట్ ని ఏర్పాటు చేస్తున్నాడు. ఈ ఈవెంట్ కి మహేష్ బాబు ని ముఖ్య అతిథిగా పిలిచారని, ఆయన కూడా ఈ ఈవెంట్ లో పాల్గొనేందుకు సుముఖత చూపించాడని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయబోతున్నారు మూవీ టీమ్. ఇటీవలే రాజమౌళి మూవీ షూటింగ్ లో పాల్గొన్న మహేష్ లుక్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సక్సెస్ ఈవెంట్ ద్వారా ఆయన లుక్ బయటపడనుంది. దీనికి సోషల్ మీడియా షేక్ అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.