Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu: మాజీ ముఖ్యమంత్రి బయోపిక్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు..?

Mahesh Babu: మాజీ ముఖ్యమంత్రి బయోపిక్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు..?

Mahesh Babu: నేటి తరం స్టార్ హీరోలలో ప్రయోగాలు చేసే హీరోలు ఎవరైనా ఉన్నారా అంటే మన అందరికి టక్కుమని గుర్తుకువచ్చే పేరు సూపర్ స్టార్ మహేష్ బాబు..ఒక్క కమర్షియల్ సూపర్ స్టార్ అయ్యి ఉంది కూడా ప్రయోగాలు చెయ్యడానికి ఏ మాత్రం వెనకాడకుండా తెలుగు సినిమా స్థాయిని పెంచాడు మహేష్ బాబు..ఈ ప్రయోగాలు కొన్ని సార్లు సక్సెస్ ని ఇచ్చి టాలీవుడ్ లో పాత్ బ్రేకింగ్ సినిమాలు గా నిలిస్తే మరికొన్ని సినిమాలు ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాలుగా నిలిచాయి..ఎలాంటి పాత్రలో అయిన పరకాయ ప్రవేశం చేసి తనదైన స్టైల్ మరియు మ్యానరిజం తో ప్రేక్షకులను అలరించే మహేష్ బాబు, భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర తో అభిమానులను మరియు ప్రేక్షకులను ఎలా అలరించాడో మన అందరికి తెలిసిందే..ఇప్పుడు మరోసారి ఆయన ముఖ్యమంత్రి పాత్రని పోషించడానికి సిద్ధం అయ్యిపోయినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త.

Mahesh Babu
Mahesh Babu

వివరాల్లోకి వెళ్తే ప్రముఖ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను మహేష్ బాబు తో ఒక్క సినిమా చెయ్యడానికి ఎంతోకాలం నుండి ఎదురు చూస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..మధ్యలో ఎన్నో కథలు బోయపాటి శ్రీను మహేష్ బాబు కి వింపించగా ఎందుకో ఇవి నాకు సూట్ కావు అని మహేష్ బాబు రిజెక్ట్ చేస్తూ వచ్చాడు..అయితే ఇటీవలే ఆయన మహేష్ బాబు ని మరోసారి కలిసి ఒక్క కథ ని చెప్పినట్టు సమాచారం..పొలిటికల్ నేపథ్యం లో సాగే ఈ కథ మహేష్ బాబు కి ఎంతగానో నచ్చింది అట..మాస్ సన్నివేశాలకు పూర్తి స్కోప్ ఉన్న ఈ స్టోరీ ని పూర్తి స్థాయిలో డెవలప్ చేసి తీసుకొని రమ్మని మహేష్ బాబు బోయపాటి శ్రీను కి చెప్పాడట..ఒక్కప్పుడు మన ఆంధ్ర ప్రదేశ్ కి ముఖ్యమంత్రి గా పని చేసిన ఒక్క మహానాయకుడి జీవితం లో చోటుచేసుకున్న ఒక్క ఘట్టం ని ఆధారంగా తీసుకొని బోయపాటి శ్రీను ఈ స్టోరీ ని అల్లాడు అట..త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులోకి రానుంది.

Also Read: Sridevi: ముగ్గురు టాలీవుడ్ హీరోలతో శ్రీదేవి పెళ్లి క్యాన్సిల్ అయ్యింది అనే విషయం ఎవరికైనా తెలుసా??

Mahesh Babu
Mahesh Babu

మహేష్ బాబు హీరో గా నటించిన సర్కారు వారి పాట సినిమా ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకొని వచ్చే నెల మే 12 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది..ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ తో ఒక్క సినిమా చెయ్యబోతున్నారు..ఇవి కాకుండా రాజమౌళి తో ఆయన ఒక్క సినిమా చెయ్యబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యేలోపు సర్కారు వారి పాట సినిమా కాకుండా మరో రెండు సినిమాలు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకి తీసుకొని రావాలి అనే ఉద్దేశ్యం తో ఉన్నాడట మహేష్ బాబు..ఆ రెండు సినిమాలలో ఒక్కటి త్రివిక్రమ్ సినిమా కాగా రెండవ సినిమా బోయపాటి శ్రీనుతో అని తెలిసింది..రాజమౌళి తో మహేష్ చెయ్యబొయ్యే సినిమా వచ్చే ఏడాది లో ప్రారంభం కానుంది..ఈలోపు మహేష్ ఒప్పుకున్నా ఈ సినిమాలు పూర్తి అవ్వాలి..మరి ఈ రెండు సినిమాలకు గాను ఆయన డేట్స్ ఎలా సర్దుబాటు చేస్తాడో చూడాలి.

Also Read:Saptapadi: పెళ్లిలో వధూవరులు ఏడడగులు ఎందుకు వేస్తారు..? వాటి అర్థం ఏంటి..?

Recommended Videos:

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

1 COMMENT

  1. […] Air Conditioner Side Effects: ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఎండలు పెరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా మార్పు చెందాయి. సూర్యుడి ప్రతాపం తట్టుకోలేక జనం విలవిలలాడుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తున్నారు. చల్లగా ఉంచే వస్తువుల కొనుగోలుకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా కూలర్లు, ఫ్రిజ్ లు, ఏసీల వినియోగం పెరిగిపోతోంది. వాటి కొనుగోలుకు ప్రజలు ముందుకు వస్తన్నారు. ఫలితంగా మార్కెట్ కళకళలాడుతోంది. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular