Pawan Kalyan Nagarjuna: అక్కినేని నాగార్జున కేవలం ఒక స్టార్ హీరోగా మాత్రమే కాదు.. నిర్మాతగా.. వ్యాపారవేత్తగా కూడా గొప్ప విజయాలు చూసిన వ్యక్తి..తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ ని ఆయన తర్వాత నాగార్జున మెయింటైన్ చేస్తూ వస్తున్నారు..ఈ బ్యానర్ మీద ఇండస్ట్రీ కి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించి ఎంతోమంది నటీనటులను పరిచయం చేసారు నాగార్జున.. ఈ బ్యానర్ మీద అధిక శాతం అక్కినేని హీరోల సినిమాలు వచ్చినప్పటికీ, తన తోటి స్టార్ హీరోలతో కూడా చాలా సినిమాలే నిర్మించాడు నాగార్జున.

అలా ప్రముఖ హీరో జగపతి బాబు ఇండస్ట్రీ లో దూసుకుపోతున్న సమయంలో ఆయనని హీరోగా పెట్టి నాగార్జున నిర్మించిన చిత్రం ‘ఆహా’.. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా విడుదలైన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయం అందుకుంది..తమిళ్ లో సూపర్ హిట్ గా నిలిచినా ‘ఆహా..!’ కి ఇది రీమేక్ గా తెరకెక్కింది..తమిళం లో దర్శకత్వం వహించిన సురేష్ కృష్ణనే తెలుగు రీమేక్ కి కూడా దర్శకత్వం వహించారు.
అయితే తొలుత ఈ సినిమాని రీమేక్ చేద్దాం అనుకున్నప్పుడు నాగార్జునకి గుర్తుకు వచ్చిన పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అట.. అప్పట్లో అన్నపూర్ణ స్టూడియోస్ లో పవన్ కళ్యాణ్ సినిమా అని పెద్ద ఎత్తున ప్రచారం కూడా సాగింది.. వారపత్రికలలో దీని గురించి ప్రత్యేకమైన ఎడిషన్స్ కూడా రాసారు.. పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చెయ్యడానికి కథాచర్చలు కూడా జరిగిన మాట వాస్తవమే కానీ, కానీ అప్పటికే అలాంటి కథతోనే వేరే సినిమా చేసాడు..ఆహా కథ కూడా అదే రకంగా ఉండడంతో ఈ సినిమాని సున్నితంగా రిజెక్ట్ చేసాడట పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత ఇది జగపతి బాబు వద్దకి వెళ్ళింది.
ఒకవేళ ఈ సినిమా పవన్ కళ్యాణ్ చేసి ఉంటే బాక్స్ ఆఫీస్ రేంజ్ మరింత ఎక్కువ ఉండేదని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు.. ఈ సినిమాని రిజెక్ట్ చేసి పవన్ కళ్యాణ్ అప్పట్లో తమ్ముడు మూవీ చేసాడు..అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో మన అందరికి తెలిసిందే..ఆ తర్వాత బద్రి, ఖుషి ఇలా ఒక డిఫరెంట్ సబ్జక్ట్స్ ని ఎంచుకొని పవర్ స్టార్ గా ఎదిగి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్.