Sunny Leone latest movie : సన్నీ లియోన్ కి ఇండియా వైడ్ అభిమానులు ఉన్నారు. హిందీలో పలు చిత్రాల్లో నటించిన సన్నీ లియోన్ సౌత్ లో సైతం సత్తా చాటుతుంది. కరెంటు తీగ , జిన్నా చిత్రాల్లో ఆమె నటించారు. గరుడ వేగ మూవీలో ఒక ఐటెం సాంగ్ చేసింది. తమిళంలో కూడా సన్నీ లియోన్ సినిమాలు చేయడం విశేషం. సన్నీ లియోన్ లేటెస్ట్ మూవీ మందిర. కామెడీ హారర్ జోనర్లో తెరకెక్కింది. మందిర చిత్రానికి ఆర్ యువన్ దర్శకుడు. యోగిబాబు, సతీష్ కీలక రోల్స్ చేశారు.
మందిర చిత్రం నవంబర్ 22న విడుదల చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అసలు వచ్చి వెళ్లిన విషయం కూడా తెలియదు. థియేట్రికల్ రన్ ముగిసిన నేపథ్యంలో ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం చేశారు. మందిర మూవీ డిజిటల్ రైట్స్ తెలుగు ఎంటర్టైన్మెంట్ యాప్ ఆహా కొనుగోలు చేసింది. డిసెంబర్ 5 నుండి మందిర మూవీ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆహా అధికారిక ప్రకటన చేసింది. అంటే నేడు అర్ధరాత్రి నుండి మందిర చిత్రాన్ని ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
మందిర మూవీ రెండు కాలాల్లో సాగే కథ. పీరియాడిక్ బ్యాక్డ్రాప్ లో సన్నీ లియోన్ యువరాణిగా కనిపిస్తుంది. ప్రెజెంట్ ఘోస్ట్ గా భయపెడుతుంది. మందిర మూవీ కథ విషయానికి వస్తే… వందల ఏళ్ల క్రితం అనకొండాపురం కి మందిర యువరాణి. వీర వనిత. ఆమె ఆత్మ ఈ కాలంలో సంచరిస్తుంది. ఒక కారణంతో ఆమె ఆత్మగా తిరుగుతుంది. మందిర ఇన్ని వందల ఏళ్ల తర్వాత ఎందుకు వచ్చింది? ఆమె లక్ష్యం ఏమిటి? అనేది కథ…
సాయి సుధాకర్ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. జావేద్ రియాజ్ మ్యూజిక్ అందించారు. కాగా కామెడీ హారర్ జోనర్స్ కి మంచి డిమాండ్ ఉంది. గతంలో వచ్చిన కాంచన, ప్రేమకథా చిత్రం, గీతాంజలి మంచి విజయాలు సాధించాయి. సన్నీ లియోన్ అభిమానులు ఈ చిత్రాన్ని అసలు మిస్ కావద్దు…
Web Title: Sunny leones latest movie mandira will be released on ott soon
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com