Sunil: మల్టీ పర్పస్ ఐటమ్స్ కి మార్కెట్ లో డిమాండ్ ఎక్కువ. నటులకు కూడా ఈ వ్యాపార సూత్రం వర్తిస్తుంది. ఎటువంటి పాత్రలో అయినా ఒదిగిపోయే యాక్టర్స్ కి లాంగ్ టైం కెరీర్ ఉంటుంది. అలాంటి నటులు ఎప్పుడూ దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ గా ఉంటారు. ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాసరావు ఈ తరహా నటులు. ఒకప్పటి హీరో జగపతిబాబు తనని తాను వర్సటైల్ యాక్టర్ గా మార్చుకున్నారు. హీరో నుండి విలన్ గా మారిన ఆయన.. ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. బిజీ యాక్టర్ గా సౌత్ ఇండియాను ఊపేస్తున్నారు.

ఈ జనరేషన్ లో ఆ బ్రాండ్ నేమ్ తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్… కథలో తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే చాలు మొహమాటం లేకుండా చేసేస్తారు. ఇచ్చిన పాత్రకు వంద శాతం న్యాయం చేస్తారు. వర్సటైల్ యాక్టర్ కి బ్రాండ్ అంబాసర్ గా మారిన విజయ్ సేతుపతి భాషాబేధం లేకుండా అన్ని పరిశ్రమల్లో నటిస్తున్నారు.
ఇలాంటి నటులను స్ఫూర్తిగా తీసుకొని తనని తాను విలక్షణ నటుడిగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు సునీల్. ఒకప్పటి ఈ స్టార్ కమెడియన్ వరుసగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేస్తున్నాడు. డిస్కో రాజా, కలర్ ఫోటో లతో పాటు తాజాగా విడుదలైన పుష్ప మూవీలో ఆయన విలన్ రోల్స్ చేశారు. ముఖ్యంగా పుష్ప మూవీలో మంగళం శ్రీను మాత్రమే కనిపించాడు. ఒకప్పుడు నాన్ స్టాప్ కామెడీ పంచిన సునీల్ ఈయనేనా అన్నట్లు పుష్పలో సునీల్ మేనరిజం, విలనిజం ఉన్నాయి.
Also Read: Box Office: పావలా పెట్టుబడికి రూపాయి లాభం… ఊహించని వసూళ్లు రాబట్టిన ఆ రెండు చిత్రాలు
మాస్ హీరోగా ఎదగాలని ప్రయత్నం చేసి బొక్కబోర్లా పడ్డ సునీల్ కి జ్ఞానోదయం అయినట్లుంది. స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకోవడం అంత సులభం కాదని, ఆఫర్స్ లేక ఖాళీగా ఉంటే కానీ తెలిసి రాలేదు. ఓ దశలో సునీల్ కెరీర్ పూర్తి సందిగ్ధంలో పడిపోయింది. ఎటువంటి పాత్రలు చేయాలో కూడా తెలియని అయోమయం ఏర్పడింది.
లేటుగా అయినా వాస్తవం బోధపడంతో ట్రాక్ లోకి వచ్చాడు. వర్సటైల్ యాక్టర్ గా నిరూపించుకుంటే లాంగ్ టర్మ్ కెరీర్ ఉంటుందని అర్థం చేసుకున్నాడు. ఇక సునీల్ హీరో అంటూ సిక్స్ ప్యాక్ ఆలోచనలు చేయడని ఆయన చేస్తున్న పాత్రలు చూస్తుంటే అర్థమవుతుంది. నెగిటివ్ పాత్రలలో కూడా మెప్పిస్తున్న సునీల్… స్టార్ వర్సటైల్ యాక్టర్స్ జాబితాలో చేరాలని ఆశిద్దాం..
Also Read: Shannukh: ‘అరే ఎంట్రా ఇదీ’.. షణ్నును కావాలనే ఓడించారా?