Homeఎంటర్టైన్మెంట్Vijay Sethupathi: విజయ్ సేతుపతికి చెన్నై కోర్టు సమన్లు.. బెంగళూరు దాడి ఘటనలో కీలక మలుపులు

Vijay Sethupathi: విజయ్ సేతుపతికి చెన్నై కోర్టు సమన్లు.. బెంగళూరు దాడి ఘటనలో కీలక మలుపులు

Vijay Sethupathi: ఇటీవలే ప్రముఖ తమిళ హీరో విజయ్​ సేతుపతిపై బెంగళూరు విమానాశ్రయంలో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయం పెద్ద దుమారమే రేపింది. గత నెలలో జాతీయ అవార్డు అందుకుని తిరిగి వస్తోన్న విజయపై ఒకరు దాడి చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. అందుకు సంబంధించిన వీడియో కూడా ఒకటి నెట్టింట్లో వైరల్​గా మారింది. కాగా, అతనెవరో ఆని ఆరాదీయగా.. అతని పేరు మహా గాంధీ అని తెలిసింది. అయితే, ట్విస్ట్​ ఏంటంటే విజయ్ పరివారమే తనపై దాడి చేసిందంటూ మహా గాంధీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చెన్నై సైదా పేట మెట్లో పాలిటన్​ కోర్టు విజయ్​తో పాటు అతని మేనేజర్​ జాన్సన్​లకు సమన్లు జారీ చేసింది. వచ్చే నెల 2న దీనిపై విచారణ జరగనుంది.

Vijay Sethupathi
summons-issued-to-vijay-sethupathi-after-maha-gandhi-files-complaint-over-bengaluru-airport

Also Read: ఎట్టకేలకు నెరవేరనున్న పునీత్ సంకల్పం.. మ్యూజియంగా తండ్రి నివసించిన పూరిల్లు

మహాగాంధీ పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు.. చెన్నై విమానాశ్రయంలో విజయ్ని చూడటానికి తను వెళ్లినప్పుడు.. అతని బృందంలోని ఓ వ్యక్తి తనతో అభ్యంతరంగా వ్యవహరించాడని మహాగాంధీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలోనే విజయ్​ పరివారానికి, తనకు మధ్య వాగ్వాదం జరిగిందని.. ఆ తర్వాత విమానాశ్రయం వెలుపల తనపై విజయ్​ మేనేజర్ జాన్సన్​ దాడిపి పాల్పడినట్లు తెలిపారు.

కాగా, ఈ దాడి జరిగిన కొద్ది రోజులకు మక్కల్​ కట్చి నాయకుడు అర్జున్ సంపత్​ విజయ్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్​ను తన్నిన వారికి రూ.1001 బహుమతిగా చెల్లిస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ విషయంపై అర్జున్​పై కూడా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Also Read: త్వరలో నటిగా పరిచయం కానున్న మిస్​ యూనివర్స్​.. ఇప్పటికే రెండు సినిమాలకు సైన్

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular