Homeఎంటర్టైన్మెంట్Suma: ఫస్ట్​లుక్​ అదిరిపోయింది.. జయమ్మగా ఆకట్టుకున్న సుమ!

Suma: ఫస్ట్​లుక్​ అదిరిపోయింది.. జయమ్మగా ఆకట్టుకున్న సుమ!

Suma: గత కొన్ని సంవత్సరాలుగా  బుల్లితెరపై యాంకరింగ్​ చేస్తూ.. ప్రేక్షకుల మనసుల్లోనే కాకుండా, వారి కుటుంబంలో ఒకరిగా కలిసిపోయారు సుమ కనకాల. తాజాగా, ఈమె సినిమాల్లోకి చాలా సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చారు. విజయ్​ దర్శకత్వంలో ఆమె ఓ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్​పై ప్రొడక్షన్​ నెం.2గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా, శనివారం ఈ సినిమా టైటిల్​తో పాటు ఫస్ట్​లుక్​ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. మెగా పవర్​స్టార్​ రామ్​ చరణ్​ వీటిని విడుదల చేశారు. ఈ సినిమాకు జయమ్మ పంచాయితీ అనే టైటిల్​ ఖరారు చేశారు. టైటిల్​తో పాటు ఫస్​లుక్​ కూడా ఎంతో విభిన్నంగా రూపొందించారు.

https://youtu.be/i3GdC37zQPg

విభిన్న అంశాలతో కూడిన పోస్టర్​లో గ్రామీణ వాతారవణాన్ని చూపించారు. సినిమాలో సుమ ఓ పల్లెటూరి పెద్దగా కనిపించనున్నట్లు పోస్టర్​ని బట్టి తెలుస్తోంది. 1996లో కల్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో హీరోయిన్​గా నటించింది సుమ. ఆ తర్వాత మళ్లీ 25 సంవత్సరాల తర్వాత ప్రధాన పాత్రలో సుమ అలరించేందుకు సిద్ధమైంది. మరి ఎప్పుడూ బుల్లితెరపై కనువిందు చేసే ఈ యాంకరమ్మ.. తన నటనతో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular